నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

టాప్ 10 వార్తలు

  • Top 10 Movies
  • Top 10 Politics
  • Top 10 Sports
  • Top 10 Tech
  • Top 10 Business

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Box Office
Movies Hub
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsBox OfficeMovies HubHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsBox OfficeMovies HubHit or FlopStocksBusinessTechGovt

ట్రైన్ లో లగేజీ పోతే లేదా దెబ్బతింటే ఏం చేయాలో తెలుసా

Andhra Jyothy2 Jun 2026, 12:11 pm
ట్రైన్ లో లగేజీ పోతే లేదా దెబ్బతింటే ఏం చేయాలో తెలుసా

ఇంటర్నెట్ డెస్క్: ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో టికెట్‌తో పాటు లగేజీ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే చాలా మంది ప్రయాణికులకు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉండదు.

ఇంటర్నెట్ డెస్క్: ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో టికెట్‌తో పాటు లగేజీ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే చాలా మంది ప్రయాణికులకు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఫలితంగా అనుమతించిన పరిమితికి మించి సామాను తీసుకెళ్లి అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ప్రయాణానికి ముందు రైల్వే లగేజీ నిబంధనలను తెలుసుకోవడం మంచిది.


క్లాస్‌ను బట్టి లగేజీ పరిమితి

భారతీయ రైల్వే ప్రతి ప్రయాణికుడికి ప్రయాణించే క్లాస్ ఆధారంగా ఉచిత లగేజీ పరిమితిని నిర్ణయించింది.

  • ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం

  • ఫస్ట్ క్లాస్ / ఏసీ 2-టియర్: 50 కిలోల వరకు

  • ఏసీ 3-టియర్ : 40 కిలోల వరకు

  • స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు

  • సెకండ్ క్లాస్: 35 కిలోల వరకు

    5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ పరిమితిలో సగం వరకు మాత్రమే ఉచిత అనుమతి ఉంటుంది.


    ఎక్కువ లగేజీ ఉంటే ఏం చేయాలి?

    నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీని ముందుగానే రైల్వే అధికారులకు తెలియజేయాలి. అదనపు బరువుకు సంబంధించిన ఛార్జీలు చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే తనిఖీల సమయంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

    లగేజీ పరిమాణంపై కూడా నిబంధనలు

    కేవలం బరువు మాత్రమే కాదు, లగేజీ పరిమాణానికి కూడా రైల్వే పరిమితులు విధించింది. చాలా పెద్ద సూట్‌కేసులు, ట్రంకులు లేదా భారీ ప్యాకేజీలను కోచ్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉండకపోవచ్చు. అలాంటి సామాను ప్రత్యేకంగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

    తీసుకెళ్లకూడని వస్తువులు

    ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని వస్తువులను రైలులో తీసుకెళ్లడాన్ని రైల్వే పూర్తిగా నిషేధించింది.

    • పేలుడు పదార్థాలు

    • గ్యాస్ సిలిండర్లు

    • ప్రమాదకర రసాయన పదార్థాలు

    • ఇతరులకు హాని కలిగించే వస్తువులు

      అలాగే వ్యాపార అవసరాల కోసం తీసుకెళ్తున్న సరుకును వ్యక్తిగత లగేజీగా చూపించడం కూడా నిబంధనలకు విరుద్ధం.

      భారీ లగేజీ కోసం ప్రత్యేక బుకింగ్

      అధిక బరువు లేదా పెద్ద పరిమాణం ఉన్న సామాను తీసుకెళ్లాలనుకుంటే, రైలు బయలుదేరే సమయానికి ముందే లగేజీ కార్యాలయంలో బుక్ చేయాలి. సామానుపై సరైన లేబుల్ ఉండాలి. బరువు, పరిమాణం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు.

      నిబంధనలు పాటించకపోతే?

      అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లి ముందుగా నమోదు చేయకపోతే అదనపు ఛార్జీలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో సాధారణ రేటు కంటే అనేక రెట్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు.

      లగేజీ పోతే లేదా దెబ్బతింటే?

      ప్రయాణ సమయంలో లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా వెంటనే రైల్వే సిబ్బంది, జీఆర్‌పీ లేదా ఆర్‌పీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లగేజీ విలువను ముందుగానే రైల్వే వద్ద నమోదు చేసి ఉంటే, అది పోయినా లేదా దెబ్బతిన్నా రైల్వే నిబంధనల ప్రకారం పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

      గుర్తుంచుకోవాల్సిన విషయం

      రైలులో ప్రయాణించే ముందు లగేజీ బరువు, పరిమాణం, రైల్వే నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన ప్రణాళికతో ప్రయాణిస్తే మీ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.


      Also Read:

      ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

      చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

      For More Latest News

    Andhra Jyothyలో పూర్తి కథనం చదవండి

    Share this article

    WhatsAppXEmail

    తాజా వార్తలు

    వేములవాడ రాజన్న క్షేత్రంలో అద్భుత ఘట్టం.. రైతులకు ఉచితంగా 200 కోడెల పంపిణీ
    Zee Telugu•14 Jul
    డబ్బు కోసం ఎంతమంది మొగుళ్లనైనా మారుస్తా! స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన
    Zee Telugu•14 Jul
    భారత మార్కెట్లోకి కొత్త సంచలనం.. సూపర్ కార్ డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్
    Zee Telugu•14 Jul
    సాయికృష్ణ మృతి విషయంలో సంచలనం.. లాకప్ లోనే సాయికృష్ణ చనిపోయాడు
    Zee Telugu•14 Jul
    కోల్ కతాలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి కూలి ఐదుగురు మృతి! శిథిలాల కింద 50 మందికి
    Zee Telugu•14 Jul
    వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్లు? పంత్ ట్రేడ్ డీల్ తో మారిన లెక్కలు
    TV9 Telugu•14 Jul

    English Keywords

    #train-luggage-rules#indian-railways-baggage-rules#railway-luggage-limit#train-baggage-allowance#extra-luggage-charges-in-train#indian-railways-travel-rules#train-luggage-weight-limit#railway-penalty-for-excess-luggage#luggage-booking-in-train#indian-railways-guidelines
    ట్రైన్ లో లగేజీ పోతే లేదా దెబ్బతింటే ఏం చేయాలో తెలుసా | nimisham.in