
మాగనూరు జూన్ 01: అక్రమంగా మొరం మట్టి తరలిస్తు్న్నా అధికారులు పట్టించుకోవడం లేదని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. నల్లగట్టు సమీపంలో అక్రమంగా మొరం మట్టి తవ్వకాలు జరిపి దాదాపు 5 నుంచి 10 ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాలు అని చూడకుండా అధికారుల కనుసైగలోనే ఈ అక్రమ మట్టిదంద కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులు వివరణ కోరగా అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని అయితే ఈ విషయంపై ఎస్ఐ నవీదుకు మూడు రోజుల కిందటే సమాచారమిచ్చారన్నారు. ఇదే విషయంపై ఎస్సై నవీద్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. అయితే కృష్ణ మండలంలో అక్రమ ఇసుక మొరం దందాలు పోలీసులు, రెవెన్యూ అధికారుల కనుసైగల్లోనే కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
.
# 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999
Website: +91-40-23291163 digitalsales@tppl.news
The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd