మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు.
మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు. మిగతాది నేను చెబుతాను అని ప్రభావతి అందుకుంది. అక్కడ రోహిణి ఇల్లు ఉంది కదా అని ప్రభావతి అంటుంది. వాళ్ల నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రవి అంటే.. ఇల్లు మాత్రం అలానే ఉంటుంది కదా.. బోలెడు కార్లు ఉన్నాయ్ అని కూడా చెప్పింది.. రోహిణి అని ప్రభావతి అంటుంది. పెళ్లైన కొత్తలో చెప్పావ్ కదా రోహిణి అని ప్రభావతి అంటే.. చెప్పానా? చెప్పే ఉంటాను లేండి అని రోహిణి అంటుంది. మనందరం ఇంత సంతోషంగా ఉంటే.. రోహిణి మాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది అని మీనా అంటుంది. సంతోషంలో మాటలు రావడం లేదు అని బాలు కౌంటర్లు వేస్తాడు. మనం అక్కడకు వెళ్లిన తర్వాత జైల్లో రోహిణి నాన్నని కలవాలి అని ప్రభావతి అంటుంది. ఆస్తి కోసమే కదా అని సత్యం అంటే.. అంత దూరం వెళ్లాక ఊరికే రావడం ఎందుకు కూతురు, అల్లుడు కష్టాల గురించి చెపితే ఖాళీ చెక్కు ఇవ్వడా? ఏంటి? అని ప్రభావతి అంటుంది.నువ్వు ఎలాగూ తీసుకు వెళ్లవు.. ఏది ఏమైనా సరే మనం వెళ్తున్నా.. నా ఫుల్ సపోర్ట్ బాలుకే అని ప్రభావతి అంటుంది. అలా ప్రభావతి మాట్లాడటం, బాలుకి సపోర్ట్ ఇవ్వడం చూసి అంతా షాక్ అవుతారు. మా గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయ్ అని మీనా, రవి, శ్రుతి కామెడీ చేస్తారు. మీరంతా ఊరుకోండి.. ముందు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పురా అని బాలుని అడుగుతుంది ప్రభావతి. పెన్ను తీసుకుని చకచకా సంతకం పెట్టేస్తుంది. ఇక మనోజ్‌ని రోహిణి సైడ్‌కి తీసుకు వెళ్లి మలేషియా ట్రిప్ వద్దని అంటుంది. నువ్వు ఎలాగో తీసుకు వెళ్లవు.. వాడు ఫ్రీగా తీసుకు వెళ్తాను అంటున్నాడు కదా అని మనోజ్ లైట్ తీసుకుంటాడు. దీంతో రోహిణి మరింత కంగారు పడుతుంది.రోహిణి బయట పడుతుందేమో.. అసలు మలేషియా ట్రిప్ ఏంటి? అంత డబ్బు మన దగ్గర ఉందా? అని బాలుని మీనా అడుగుతుంది. ఇదంతా నాటకం.. ఇప్పుడు ఈ మలేషియా ట్రిప్‌ను తప్పించుకోవడానికి రోహిణి ఏదో ఒకటి చేస్తుంది.. దొరికి పోతుంది అని బాలు అంటాడు. వస్తాను అని చెప్పినా ఏదో ఒకటి చివరి నిమిషంలో చేసి ఆగిపోతుంది.. లేదంటే మన అందరినీ వెళ్లకుండా ఆపుతుంది.. ఇలా ఏదో ఒకటి అయితే చేస్తుంది కదా అని మీనా అంటుంది. అసలు మనం ముందు రోహిణి గురించి ఇంకా ఎన్నో సీక్రెట్స్ తెలుసుకోవాలి అని మీనా, బాలు అంటారు. అదే మనకు, మన కుటుంబానికి, ఆమెకు కూడా మంచిది అని బాలు, మీనా అనుకుంటారు.గాల్లో తేలిన ప్రభావతి.. ఇక అప్పుడే మలేషియాకి వెళ్లేందుకు, రోహిణి నాన్నని కలిసేటప్పుడు స్వీట్స్ కావాలని బాలుకి చెబుతుంది. ఇప్పుడే కొంటే అప్పటికి పాడవుతాయ్ అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక మలేషియా విశేషాలు, చూడదగిన ప్రధేశాల గురించి ప్రభావతి తెలుసుకుంటూ ఉంటుంది. శ్రుతి, రవి అక్కడి విశేషాలు చెబుతుంటే చెవులురిక్కించి మరీ వింటుంది. అక్కడ అలా చేద్దాం.. ఇలా చేద్దాం.. అలా తిరుగుదాం అని ప్రభావతి సంబరపడుతుంటుంది. నాకు విండో సీట్ కావాలని ప్రభావతి అంటుంది. మాకు పనులున్నాయ్ అని రవి, శ్రుతి, మనోజ్, రోహిణి అంటారు. ఎవరు వచ్చినా రాకున్నా నేను, బాలు మాత్రం వెళ్తామని ప్రభావతి అంటుంది. రోహిణి మొసలి కన్నీళ్లు.. రోహిణి ఇక నాటకం మొదలు పెడుతుంది. మొసలి కన్నీళ్లు కారుస్తూ మనోజ్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ మలేషియా ట్రిప్ అవసరమా? మా నాన్నని కలవడం అవసరమా? నువ్వు ఎందుకు ఆపడం లేదు అని మనోజ్‌ని రోహిణి నిలదీస్తుంది. ఎక్కువ గొడవ చేయకు, ఇష్యూ చేసుకోకు అని మనోజ్ అంటాడు. ఇంత కాలం ఎందుకు రాలేదు.. ఇప్పుడే ఎందుకు వచ్చారు అని మా నాన్న నన్ను అడిగితే ఏం చెప్పాలని రోహిణి నాటకాలు ఆడేస్తుంది. బాలు అయితే మీనా కోసం ఏమైనా చేస్తాడు.. నువ్వు మాత్రం నా కోసం సపోర్ట్ చేయవు అని రోహిణి ఏడ్చేస్తుంది. నా ఆస్తి అంతా కోర్టులోనే ఉంది.. డబ్బు కోసమే నన్ను చూస్తున్నారా.. నా ఫీలింగ్స్ పట్టించుకోరా? అని మనోజ్‌ని మార్చేస్తుంది రోహిణి. ఇప్పుడేంటి?.. బాలు మలేషియాకి వెళ్లకూడదు అంతేనా? అని మనోజ్ కిందకు వెళ్తాడు.మలేషియాకి వెళ్లొద్దు.. మరో వైపు మలేషియాలో డ్రెస్సులు వేసుకోవాలంట కదా అని ప్రభావతి అంటుంది. ఇంతలో మనోజ్ వచ్చి.. నువ్వు పాస్ పోర్ట్ ఆఫీస్‌కి వెళ్లొద్దు.. మలేషియాకి వెళ్లడానికే వీళ్లేదు.. అని బాలుతో అంటాడు. అది చెప్పడానికి నువ్వు ఎవరు అని ప్రభావతి అంటుంది. నేను ముందే చెప్పాను కదా? అని బాలు, మీనా అనుకుంటారు. జైల్లో ఉన్నప్పుడే వెళ్లి చూడాలన్నట్టుగా ప్రభావతి చెబుతుంది. ఇవన్నీ నీకు పెళ్లామే చెప్పిందా? అని ప్రభావతి అంటుంది. ఇలాంటి టైంలోనే వెళ్లి మాట్లాడాలి.. అప్పుడే మనం ఆయనకు తోడుగా ఉన్నామనిపిస్తుందని మీనా అంటుంది. అవును మీనా కరెక్ట్ గానే చెప్పింది కదా అని ప్రభావతి అంటుంది.ఒక్క మాటపై బాలు, ప్రభావతి, మీనా.. దీంతో మీనా, సత్యం, బాలు అంతా షాక్ అవుతారు. మీనాకి సపోర్ట్‌గా ప్రభావతి మాట్లాడటం ఏంటి? అంతా అవాక్కవుతారు. రేపు బయటకు వచ్చాక.. ఆయన మనల్ని తప్పు పడితే.. నన్ను చూడటానికి రాలేదు అని విమర్శిస్తే ఎలా అని మీనా అంటే ప్రభావతి కూడా తలూపుతుంది. నువ్వు వెళ్లు రా.. అసలు ఎవరు ఆపుతారో చూస్తాను అని బాలుని పాస్ పోర్ట్ ఆఫీస్‌కి పంపుతుంది ప్రభావతి. నువ్వు కాస్త గ్లామర్ మెయింటైన్ చెయ్ అమ్మా అని అంటాడు బాలు. దీంతో పై నుంచి చూస్తున్న రోహిణి మరింతగా చిరాకు పడుతుంది.ఏదో సీక్రెట్ ఉంది.. ఆ తరువాత మనోజ్, రోహిణిల గురించి బాలు, మీనాలు చాటుగా మాట్లాడుకుంటారు. నేను చెప్పానుగా ముందే ఇలా ఏదో ఒకటి చేస్తారని, మనం మలేషియా గురించి మాట్లాడినా, జైలు టాపిక్ తీసినా రోహిణి కంగారు పడుతుంటుందని బాలు, మీనాలు అనుకుంటారు. ఆ రోజు మలేషియా జంట వచ్చినప్పుడు కూడా ఇలానే నాటకం ఆడిందని మీనా అంటుంది. మనకు తెలియకుండా ఏదో సీక్రెట్ దాచి పెడుతోంది.. అందుకే ఇంత కంగారు పడుతుంది.. దాన్ని బయట పెట్టాలి.. ఇంకా ముందుకు వెళ్దాం.. ఏదో ఒక తప్పు చేస్తుంది.. అని బాలు అంటాడు. మీ అన్న మాత్రం నిజంగానే రోహిణిని నమ్మేస్తున్నాడు అని మీనా అంటాడు. వాడొక వెర్రి బాబులోడు.. ఎవర్నైనా నమ్మేస్తాడు అని బాలు అంటాడు.టైం స్పెండ్ చేయడం లేదు.. సీరియల్లో ఓ సీన్‌కు డబ్బింగ్ చెప్పాను. అందులో భార్యాభర్తలు కలిసి సమయాన్ని గడపడం లేదు.. అందుకే విడాకులు తీసుకుంటారు.. మనం కూడా అలానే ఉన్నాం.. ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం లేదు.. మనిద్దరం మన గురించి హాయిగా నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భాలు కూడా కనిపించడం లేదు.. భార్యాభర్తల్లా కాకుండా రూమ్ మేట్స్‌లా ఉంటున్నాం.. అని శ్రుతి అంటుంది. ఇద్దరం కలిసి పని చేస్తుంటే ఇలానే ఉంటుంది.. అసలు మన ఇంట్లో ఎవరెవరు ఎంతెంత టైంని కేటాయిస్తున్నారో అడుగుదామని రవిని శ్రుతి కిందకు తీసుకు వెళ్తుంది.రవికి మనోజ్ సలహా.. బాలు, మీనా, మనోజ్, రోహిణిల ముందు శ్రుతి పంచాయితీ పెడుతుంది. నీతూతోనే ఎక్కువగా ఉంటున్నాడు.. నన్ను పట్టించుకోవడం లేదు అని చెబుతుంది శ్రుతి. మేం ఎలాగూ కొట్టుకు చస్తున్నాం.. మీరైనా సంతోషంగా ఉండొచ్చు కదా? అని మనోజ్ అంటాడు. వీడి జీవితంలో ఇదొక్కటే కరెక్ట్‌గా చెప్పాడు అని బాలు కౌంటర్లు వేస్తాడు. అసలు మీరు రోజుకి ఎన్ని గంటలు కలిసి ఉంటారు అని మనోజ్, రోహిణిలను శ్రుతి అడుగుతుంది. తొమ్మిది గంటలు అని చెప్పడంతో.. చూశావా.. వింటున్నావా? అని రవిని శ్రుతి నిలదీస్తుంది. ఇంతలో బాలు మరో కౌంటర్ వేస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.