
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
IIIT Student Commits suicide in Gachibowli: హైదరాబాద్ లోని గచ్చి బౌలీలోని ట్రిపుల్ ఐటీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గచ్చి బౌలీలోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిరూప్ అనే విద్యార్థి ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టూడెంట్ రక్తపు మడుగులో విలవిల్లాడుతూ చనిపోయాడు. ఒక్కసారిగా అక్కడున్న వారు భయంతో పరుగులు పెట్టారు.
చాలాసేపు వరకు అక్కడ ఏంజరిగిందో కూడా కొంత మందికి అర్థంకాలేదు. క్యాంపస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విద్యార్థి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. చనిపోయిన వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలంకు చెందిన అభిరూప్ ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
గత కొంత కాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఒక వైపు చదువు ఒత్తిడి మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. అసలు విద్యార్థి సూసైడ్ కు గల కారణాలు ఏంటని పోలీసులు విచారణ చేపట్టారు. చదువంటే ఒత్తిడా..?.. లేదా..మరేదైన ఉందా.?... అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.