రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ఫేస్‌వాష్ చేసుకోండి. ముల్తానీ మట్టి ముఖంపై జిడ్డును తొలగిస్తుంది.
2 స్పూన్ల శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయండి. దీంతో మృతకణాలు తొలగుతాయి. జిడ్డు మాయం అవుతుంది.
ఓట్మీల్ మొత్తగా గ్రైండ్ చేయండి. అందులో తేనె కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ వాపును తొలగిస్తుంది. జిడ్డును మాయం చేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ టమటా రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే జిడ్డు మాయం.
ఒక టీ స్పూన్ కలబంద జెల్లో మరో టీ స్పూన్ కీరదోస రసం కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ చర్మంపై జిడ్డును తొలగిస్తుంది.
ఎగ్ వైట్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. ఇందులోని ప్రోటీన్ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల జిడ్డు మాయం అవుతుంది.
పసుపులో శనగపిండి కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు తొలగుతుంది.
పుదీనా ఆకులను పేస్ట్ చేసి తేనె కలిపి ముఖానికి రాయండి. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల జిడ్డు మాయం అవుతుంది.
చందనంలో రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు తొలగుతుంది.