
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.
వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
అమరావతి, జులై 4 (ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి, గిరిజన ప్రజల హక్కులు, గౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆయన పోరాటం కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదని చెప్పారు. ధైర్యం, త్యాగం, దేశభక్తిని ఎన్నటికీ మరిచిపోలేమని అన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రాన్ని కాపాడాలంటే బాధ్యతతో జీవించాలని... దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని... సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని చెప్పుకొచ్చారు. అందరం ఆ మహానీయుని ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొంది, న్యాయం, సేవ, దేశభక్తి వంటి విలువలను ఆచరిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News