
Samsung Galaxy F70e 5g Offer: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో Samsung Galaxy F70e 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది.
ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఆకర్శనీయమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy F70e 5g Offer Latest News: మీరు కూడా అత్యంత చీప్ ధరకే అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియం ఫీచర్లతో కూడిన మంచి మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన శుభవార్త.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ Flipkart GOAT సేల్‌లో సాంసంగ్ కంపెనీకి చెందిన ఒక పాపులర్ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ఈ Flipkart GOAT సేల్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ F70e 5G (Samsung Galaxy F70e 5G) మోడల్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తూ వస్తున్నాయి.
మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ F70e 5G (128 GB స్టోరేజ్, 4 GB RAM) వేరియంట్ అసలు ధర (MRP) రూ.18,999తో అందుబాటులో ఉంది.. అయితే, జూలై 4వ తేదీన ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఇది కేవలం రూ.12,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఫ్లాట్ డిస్కౌంటే కాకుండా.. అదనంగా వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది.. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌తో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.1,125 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
ఈ Samsung Galaxy F70e 5G స్మార్ట్‌ఫోన్‌పై GOAT సేల్‌లో అద్భుతమైన ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల కస్టమర్లకు దాదాపు రూ.4,900 వరకు భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్లతో పాటు ఈ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా వినియోగిస్తే..రూ.6,974 లోపే మీ సొంతం చేసుకోవచ్చు..
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ గెలాక్సీ F70e 5G ఫోన్ లైమ్లైట్ గ్రీన్ కలర్ వేరియంట్లో అత్యంత ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5G కనెక్టివిటీ, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, ఎన్నో రకాల ఫీచర్లతో లభిస్తున్న ఈ ఫోన్‌ను రూ.7 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ కేవలం సేల్ వరకే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునేవారు సేల్‌లో ఈ ఆఫర్స్ క్లైమ్ చేసుకోవచ్చు.