
అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసుకుంది.
అమెరికా చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సన వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించ తలపెట్టింది. వాషింగ్టన్ డీసీలో సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆ వేడుకలను రద్దు చేసింది. ఇందుకు ప్రధాన కారణం వాతావరణం.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
జాతీయ వాతావరణ సంస్థ మేరకు, ప్రస్తుతం అమెరికాలో దాదాపు 16 కోట్ల మంది ప్రజలు ఎండతీవ్రతకు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతమంతా భానుడి భగభగలకు విలవిలలాడిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత బిజీ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో హీట్ ఇండెక్స్ ఏకంగా 105 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకుంది. ఎండల తీవ్రత కారణంగా గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫేర్ ఉత్సవాలను సైతం సస్పెండ్ చేశారు.
ఈ అసాధారణ వేడి ప్రభావం కారణంగా గృహాలు, కార్యాలయాల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో విద్యుత్ గ్రిడ్లపై భారీ ఒత్తిడి పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో పవర్ గ్రిడ్లు ఫెయిల్ అయి, వేలాది మంది ప్రజలు కరెంట్ లేక ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఎండల దెబ్బ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లపైన కూడా పడింది. ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య మ్యాచ్‌ల మధ్యలో ప్రత్యేకంగా 'హైడ్రేషన్ బ్రేకులు తప్పనిసరి చేస్తూ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే అత్యంత ఘనంగా జరగాల్సిన అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.
USA extreme heat wave, Washington DC heat warning, US power grid failure, New York, Teluguone
రూ.150 కోట్లతో కుప్పంలో సరికొత్త అగ్రికల్చర్ హబ్..!
.