
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Peddi OTT Release Date: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వేదికగా విడుదలకు సిద్ధమైంది.
10 రోజుల్లో రూ.378 కోట్లు..! టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో 'పెద్ది' సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుటి వరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
ఆ ఓటీటీలో విడుదలకు సిద్ధం.. కేవలం 35 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదల కానుండడం విశేషం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల తేదీని ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. జూలై 9న తమ ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే హిందీ వెర్షన్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
సినిమా ప్రత్యేకతలు..నటీనటుల ప్రతిభ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి.
వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.