
భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
Jul 4 2026 10:58 AM | Updated on Jul 4 2026 11:10 AM
భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి ఉన్న ఒక ఫొటో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఫొటోపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు జూన్ 26న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం భోపాల్‌లో ఉంటోంది. ఆయన సీఎస్‌గా అత్యున్నత పదవిని చేపట్టిన తరుణంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక పత్రికలో శుభాకాంక్షల ప్రకటనను ఇచ్చారు.
ఇది సాధారణ ప్రకటనలా కనిపించినప్పటికీ, అందులో కనిపిస్తున్న ఫొటో చర్చకు దారితీసింది. ఆ ఫొటో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినదో ప్రకటనలో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటో ఎంపికలో సంజయ్ జాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న అధికారి రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా కనిపించాలని కొందరు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో కలిసి ఫొటో దిగడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని మరికొందరు అంటున్నారు.
ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
హర హర మహాదేవ అంటూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం (ఫొటోలు)
కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
హైదరాబాద్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి (ఫొటోలు)
నాడు పవన్ చెప్పు చూపిన రోజే బుద్ధి చెప్పి ఉంటే.. ఏకిపారేసిన అడ్వకేట్ రజిని
గోవాలో CI నాగరాజు ఫోన్.. పోలీస్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు..
నేను పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూశా..? డిప్యూటీ సీఎంకు క్రిమినల్ కు తేడా ఏంటి?
61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో