
ఇంటర్నెట్‌డెస్క్: బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా బలోచిస్థాన్‌లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్లు...
ఇంటర్నెట్‌డెస్క్: బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా బలోచిస్థాన్‌లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది పాక్ (Pakistan) జవాన్లు మరణించినట్లు పేర్కొంది. తమ ఫైటర్స్ శిబిరంలోకి చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బీఎల్ఏ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఈ దాడి, మృతులకు సంబంధించి పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణ ఉండాలని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద గ్రూపు బీఎల్ఏ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.