
మనం కళ్లారా చూసిన విషయాలను, మన మెదడులో భద్రంగా ఉన్న జ్ఞాపకాలను సైతం కృత్రిమ మేధ పూర్తిగా మార్చేయగలదని 'మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (ఎంఐటీ) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలు మనుషులలో జరగని సంఘటనలను కూడా నిజంగానే జరిగాయనే భ్రమను కల్పిస్తున్నాయని, పైగా ఆ తప్పుడు జ్ఞాపకాలపై ప్రజల్లో నమ్మకం మునుపటి కంటే చాలా బలంగా ఉంటోందని సైకాలజిస్ట్ ఎలిజబెత్ లోఫ్టస్, పరిశోధకుడు పాట్ పటారనుతపోర్న్ నేతృత్వంలోని ఎంఐటీ బృందం వెల్లడించింది. కంప్యూటింగ్ సిస్టమ్స్‌పై జరిగిన 'సీహెచ్ఐ కాన్ఫరెన్స్'లో ఈ పరిశోధన వివరాలను సమర్పించారు.ఈ పరిశోధనలో భాగంగా 200 మందిని నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి ఏఐ ఎడిట్ చేసిన ఫోటోలు, వీడియోలను చూపించారు. ఏఐ ఎడిట్ చేసిన ఫోటోల ఆధారంగా రూపొందించిన వీడియోలను చూసిన వారు.. అసలు జరగని విషయాలను కూడా తాము స్వయంగా చూశామని గట్టిగా నమ్మడమే కాకుండా, సాధారణ నియంత్రణ సమూహం కంటే రెండు రెట్లు ఎక్కువగా తప్పుడు జ్ఞాపకాలను నిజమని వాదించారు. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఏఐ చాట్బాట్లతో మాట్లాడే సమయంలో కూడా అవి నెమ్మదిగా తప్పుడు వివరాలను మనుషుల మెదడులోకి జొప్పిస్తున్నాయని, గతంలో ఒక లాయర్ అడిగే లీడింగ్ ప్రశ్నలు ఎలాంటి ప్రభావాన్ని చూపేవో, ఇప్పుడు ఒక ఫ్రెండ్లీ ఏఐ చాట్ అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా జ్ఞాపకాలను మార్చేస్తోందని పరిశోధకులు గుర్తించారు.ముప్పై ఏళ్ల నాటి భయం.. ఇప్పుడు ఏఐ రూపంలో!నిజానికి మానవ మెదడులో తప్పుడు జ్ఞాపకాలను చొప్పించడం సులువని శాస్త్రవేత్తలకు ముప్పై ఏళ్ల