
భారత్లో మందుల ధరలు ఎంత తక్కువగా ఉంటాయో వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్లో మందుల ధరలు ఎంత తక్కువగా ఉంటాయో వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలో సుమారు 900 డాలర్లు (దాదాపు రూ.85 వేలు) ధర గల ఒక మాత్ర, భారత్లో కేవలం రూ.35 నుంచి రూ.300 మధ్య లభిస్తోందని ఆమె వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి (Medicine price India vs US).
భారత్లో నివసిస్తున్న లిజ్ అనే అమెరికన్ మహిళ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె అత్త రక్త క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స అందుకుంటున్నారు. చికిత్సలో భాగంగా రెవ్లిమిడ్ అనే ఔషధం అవసరమవుతుందని, అమెరికాలో ఒక్క మాత్రకు సుమారు 900 డాలర్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. భారతదేశంలో లభించే అదే మాత్ర ధర రూ.35 నుంచి రూ.300 మధ్య ఉందని వివరించింది (Healthcare costs USA).
'అమెరికాలో ప్రజలను దోచుకుంటున్నారు. కానీ భారత్లో ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం, మందులు లభిస్తున్నాయి' అని లిజ్ పేర్కొన్నారు (Medicine price comparison). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అమెరికాలో ఔషధాల ధరలు అధికంగా ఉండటానికి అక్కడి ఆరోగ్య బీమా విధానం, బ్రాండెడ్ ఔషధాల ధరలు, మార్కెట్ విధానాలు వంటి అనేక అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..