
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెలలో జీ5 వరుస వినోదాలు పంచేందుకు సిద్ధమైంది. అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ (Veerabhadruni Rahasyam) ఇప్పటికే...
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెలలో జీ5 వరుస వినోదాలు పంచేందుకు సిద్ధమైంది. అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ (Veerabhadruni Rahasyam) ఇప్పటికే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇందులో 60 ఎపిసోడ్లు ఉంటాయని ప్రతి వారం ఓ కొత్త ఎపిసోడ్ విడుదలవుతుందని జీ5 వెల్లడించింది. ఈ సిరీస్‌లో ఊహకు అందని ట్విస్టులు ఉంటాయని తెలిపింది. ఇక, ఇదే వేదికగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu) కూడా తాజాగా స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమాతో పలకరించారు నటుడు వడ్డే నవీన్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జులై 17 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు శ్రీకాంత్ నటించిన ‘అబ్జెక్షన్ మై లార్డ్ (Objection My Lord)’ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు జీ5 తెలిపింది.
త్రిమూర్తులు (వడ్డే నవీన్) ఓ సాధారణ కానిస్టేబుల్. నీతి నిజాయతీకి పెట్టింది పేరు. అయితే పనిలో తను చూపే ఆ నిజాయతీ వల్లే పదేళ్ల కాలంలో దాదాపు 55సార్లు బదిలీ అయ్యి.. డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. అలా తను ఓసారి అమలాపురం నుంచి అరకులో తన తండ్రి (దేవి ప్రసాద్) పని చేసిన పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఈ క్రమంలోనే అక్కడ అతనికి ఓ గిరిజన అమ్మాయి అత్యాచార కేసుకు సంబంధించిన ఫైల్ దొరుకుతుంది. దాదాపు 20ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనకు అసలు కారకుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కమలాదేవి (శిల్పా తులస్కర్) తనయుడు, హోంమంత్రి సంతోష్ (వివేక్ రఘువంశీ) అని తెలుసుకుంటాడు. దీంతో బాధిత యువతికి న్యాయం చేసేందుకు.. రంగంలోకి దిగుతాడు త్రిమూర్తులు. మరి ఆ తర్వాత ఏమైందనేది చిత్రకథ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.