
రాహు ప్రభావం మేష రాశివారికి అనుకోని సమస్యలు, సవాళ్లను తీసుకురానుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు రానున్నాయి. ఈ 5 నెలల సమయంలో.. ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే... పెట్టుబడులు పెట్టినా..
ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. కోపంతో తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా... భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కుంభ రాశిలో రాహు సంచారం.. కర్కాటక రాశివారికి కూడా ఊహించని సమస్యలు తీసుకురానుంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరి వరకు వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. పరిస్థితులు ఏ మాత్రం మీకు అనుకూలంగా ఉండవు. తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదురౌతాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ తో ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాహు కుంభ రాశిలోనే ఉన్నాడు. డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు. అందుకే.. ఈ రాశివారికి అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులు అనే మాటలు మానసికంగా చాలా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో ఈ రాశివారు వీలైనంత వరకు సహనంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగులు ఇబ్బందులు, ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.