
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్లో ఉన్న 4 హెక్టార్ల వివాదాస్పద భూమి చుట్టూ సాగుతున్న భూ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వదిన సాయిరా వాద్రా..
మరణించిన భూ యజమాని కుల్సుమ్ ఖాన్ సోదరి, 90 ఏళ్ల వృద్ధురాలు నస్రీన్ సంగాల మధ్య ఈ ఆస్తి తగాదా నడుస్తోంది. కుల్సుమ్ ఖాన్ 2025 డిసెంబర్లో అవివాహితగా చనిపోవడంతో, ఆమె ఆ భూమిని విల్లు ద్వారా తనకు రాసిచ్చిందని సాయిరా వాద్రా వాదిస్తుండగా... తానే అసలైన వారసురాలినని నస్రీన్ పేర్కొంటున్నారు.ఈ సివిల్ కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగానే, నస్రీన్ తన అనుచరులతో కలిసి ఫామ్‌హౌస్‌లోకి చొరబడి కార్మికులను వెళ్లగొట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారని సాయిరా వాద్రా ఆరోపించారు. దీనిపై కిచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యే తిలక్ రాజ్ బెహర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఫామ్‌హౌస్ వెలుపల భారీ నిరసనకు దిగారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యంత్రాంగం సహకరిస్తోందని ఆరోపిస్తూ భూమిని సీల్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ఈ వివాదం దిల్లీకి చేరడంతో, సాయిరా వాద్రా ద్వారా ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు భూకబ్జాకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన ఆరోపణలు చేశారు.మరోవైపు, ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సివిల్ కోర్టు ఇప్పటికే జూన్ 11న తాత్కాలిక