
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దక్షిణ మూర్తితో సూరజ్ మాట్లాడడాన్ని చూసి నువ్వు దక్షిణ మూర్తి మనిషివా అని అడుగుతాడు శివన్నారాయణ. దక్షిణ మూర్తి అంటే ఎవరని అడుగుతాడు సూరజ్.
ఎవరో తెలియకుండానే నువ్వు ఇప్పటివరకు మాట్లాడావా.. అంటాడు శివన్నారాయణ. నిజంగా అతనెవరో నాకు తెలియదు. మీ ఫ్యామిలీ గురించి అడిగాడు. నేను చెప్పలేదు అంటాడు సూరజ్. సరే ఇంకెప్పుడు తనతో మాట్లాడకు అంటాడు శివన్నారాయణ. ఎందుకు అని సూరజ్ అడిగితే.. మాట్లాడొద్దని చెప్పానుగా మాట్లాడకు అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. సూరజ్ ని పక్కకు పిలిచి నేను తర్వాత చెప్తాను లోపలికి వెళ్లు అంటాడు కార్తీక్.
ఆ తర్వాత దక్షిణ మూర్తి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. అంతలో శౌర్య వచ్చి పిలుస్తుంది. ఆఫీస్కు ఎందుకు వచ్చావ్ అని అడిగితే ప్రోగ్రెస్ కార్డు చూపిస్తుంది. మార్కులు ఇంత తక్కువ వచ్చాయేంటే అని అడుగుతాడు శివన్నారాయణ. ఐదో క్లాస్ చదివిని దీప కూతురు స్కూల్ ఫస్ట్ వస్తుందా ఏంటి అంటుంది జ్యోత్స్న. అయితే ఇకపై శౌర్యకు నువ్వే ట్యూషన్ చెప్. ఏ నోటితో శౌర్య చదువు గురించి ఎగతాళి చేశావో అదే నోటీతో శౌర్యకు ట్యూషన్ చెప్పాలి. ఇది నా ఆర్డర్ అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.
వింత వింత ప్రశ్నలు అడిగి జ్యోత్స్నను విసిగిస్తుంది శౌర్య. అనవసరమైన విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఉంటుందని జ్యోకు కౌంటర్ ఇస్తాడు కార్తీక్. అంతలో పారు వస్తుంది. ఏం చేస్తున్నారు అని అడిగితే జ్యో, నాకు ట్యూషన్ చెప్తోందని అంటుంది శౌర్య. అంతమంచి పని అది చేయదే అంటుంది పారు. సరే నువ్వు చేయమని చెప్పి పారును ఇరికించి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
మరోవైపు సూరజ్ ఫ్యామిలీ గురించి ఆరా తీస్తారు దీప, కార్తీక్. సూరజ్ తనకు ఎవ్వరూ లేరని, ఇప్పుడు మాత్రం ఒక అన్నయ్య, వదినా ఉన్నారని, అది మీరే అని దీప, కార్తీక్ లతో చెప్తాడు. ఆ తర్వాత దక్షిణమూర్తి గురించి అడుగుతాడు. మా తాత, ఆయన బద్ధ శత్రువులు, ఆయనకు దూరంగా ఉండటం మంచిదని చెప్తాడు కార్తీక్. నా మీద అనుమానం అవసరం లేదు. మీతో ఉన్న ఈ బంధాన్ని నేను జీవితాంతం కాపాడుకుంటాను అని చెప్తాడు సూరజ్. ఏ బంధం అనుకుంటూ లోపలికి వస్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ మా వదిన అన్నయ్య అని చెప్తాడు సూరజ్. అవసరానికి ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు అంటుంది జ్యోత్స్న. నీకు ఇలాంటివి అర్థం కావులే అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. వెనకాలే దీప, కార్తీక్ కూడా వెళ్తారు.
మరోవైపు పారు పద్యాలు పాడుతూ, వాటి అర్థాలు చెప్తూ ఉంటుంది. పారిజాతం పద్యాలకు అర్థాలు తప్పుగా చెప్తే శౌర్య వాటిని సరిచేస్తూ ఉంటుంది. ఇంతలో శివన్నారాయణ అక్కడకు వచ్చి, చాలా బాగా చెప్తున్నావు శౌర్య. ఇకపై నువ్వే పారిజాతానికి ట్యూషన్ చెప్పు. అలాగైనా కొన్ని విషయాలు తెలుసుకుంటుంది అని చెప్తాడు. సరే అంటుంది శౌర్య.
ఇంకోవైపు పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి జ్యోత్స్న టేబుల్ మీద పెట్టి చెక్ చేయమని చెప్తాడు కార్తీక్. నావల్ల కాదు అంటుంది జ్యోత్స్న. ఇదే మాట పెద్ద సారుతో చెప్తాను అంటాడు కార్తీక్. వద్దు బాబు.. చేస్తాను అంటుంది జ్యోత్స్న. రేపు ఉదయం లోపు ఇవ్వాలట. త్వరగా చేసెయ్ అంటాడు కార్తీక్. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద పగ తీర్చుకుంటున్నారా అంటుంది జ్యోత్స్న.
ఒకవేళ నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే బాలరాజు గాడి గురించి సుమిత్ర అత్తకు ఎప్పుడో చెప్పేవాన్ని అంటాడు కార్తీక్. చెప్పలేదంటే మారడానికి నీకు ఓ అవకాశం ఇచ్చామని అర్థం. ఇప్పటికైనా మారితే మంచిది. లేకుంటే దీపను మీ నానమ్మ ఎక్కడ వదిలేసిందో నిన్ను అక్కడే వదిలేయాల్సి వస్తుంది అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.