
చందుర్తి,జూలై03 : ఆటో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా భీమారం మండలం గోవిందం గ్రామానికి చెంది
న భక్తులు వేములవాడ రాజన్న ఆలయానికి యలుదేరారు. చందుర్తి మండలం మల్యాల కొత్త హనుమండ్ల దగ్గరకు రాగానే ఆటో అదుపు తప్పి గుంతలో దూసుకెళ్లింది.
అప్రమతమైన డ్రైవర్ గ్రామస్తులకు సమచారం ఇవ్వడంతో 12వార్డు సభ్యుడు పిట్ల మనోహర్ స్పందించి జేసీబీ సహాయంతో ఆటోను బయటకు తీసి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఆనంతరం రోడ్డు మరమత్తులు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.