సొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఐదోసారి తుది పోరుకు అర్హత సాధించింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు.. ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియా.. తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది.కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 169/5 పరుగులు చేసింది. ఓ దశలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లీష్ జట్టును కెప్టెన్ న్యాట్ సీవర్ బ్రంట్ ఆదుకుంది. 47 బంతుల్లో 75 పరుగులు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. హీథర్ నైట్ (47 బంతుల్లో 58 రన్స్)తో కలిసి ఆమె.. 4వ వికెట్‌కు 90 బంతుల్లో 133 పరుగులు జోడించింది. దీంతో ఇంగ్లాండ్.. పోరాడే స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, నాన్కులులేకో మాబా రెండేసి వికెట్లు తీశారు. మారిజాన్నే కాప్ ఒక వికెట్ తీసింది.అనంతరం సవాల్ విసిరే లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తేలిపోయింది. నాకౌట్ మ్యాచులలో ఒత్తిడికి చిత్తయ్యే అలవాటు ఉన్న ఆ జట్టు.. మరోసారి ఛోకర్స్గా మిగిలిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు స్కోరు చేసింది. దీంతో ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్.. ఈ టోర్నీ చరిత్రలో ఐదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. సొంతగడ్డపై టైటిల్ ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.ఆదివారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ జరగనుంది. ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్లు ఇవే..8 - ఆస్ట్రేలియా5 - ఇంగ్లాండ్3 - న్యూజిలాండ్2 - దక్షిణాఫ్రికా