మాస్క్ వేసుకోవడానికి ముందు చర్మాన్ని రెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీంతో ఫ్యాక్లోని పదార్థాలు చర్మంలోని సమర్థవంతంగా ఇంకుతాయి. ముందుగా మీ చర్మాన్ని మైల్డ్ క్రెన్సర్తో శుభ్రం చేసుకోండి.
ఆ తర్వాత స్క్రబ్‌తో ఎక్స్ఫోలియేట్ చేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లయ్ చేయండి. ఈ మూడు స్టెప్స్ తర్వాతా మీ చర్మం ఫేస్ మాస్క్‌కు రెడీగా ఉంటుంది.
ఈ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయండి. తేనె చర్మానికి తేమను అందిస్తుంది, అలాగే పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు, ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి. తడి ఆరిన తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను అప్లయ్ చేయండి.
కలబందలో చర్మాన్ని ఉపశమనం ఇచ్చే గుణాలు ఉంటాయి. తాజా కలబంద ఆకు నుంచి జెల్ తీసి.. మీ ముఖంపై పలుచని పొరలా రాయండి. చర్మంలోకి బాగా ఇంకేలా మసాజ్ చేసి, రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేయండి.
శనగపిండి, పసుపులోని గుణాలు మీ చర్మం టాన్‌ను తొలగించి, తిరిగి కాంతివంతంగా మారుస్తాయి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని దానిలో ఒక చిటికెడు పసుపు వేయండి. దానిలో కొద్దిగా పాలు వేసి పేస్ట్‌లా చేయిండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
టమాటాలోని గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుడి అతినీలలోహిత (UV) కిరణాల వల్ల కలిగే హాని నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. బాగా పండిన టమాటా గుజ్జును తీసి నేరుగా చర్మానికి అప్లయ్ చేయండి. ఈ ప్యాక్‌ను 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి