
వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం పై ఏబీ డివిలియర్స్ కామెంట్స్ ఇంకెన్నాళ్లు అతడిని బెంచ్‌పై కూర్చొబెడతారు ఐర్లాండ్‌తో ఆడిస్తే బాగుండేది AB De Villiers : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15...
వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం పై ఏబీ డివిలియర్స్ కామెంట్స్ ఇంకెన్నాళ్లు అతడిని బెంచ్‌పై కూర్చొబెడతారు ఐర్లాండ్‌తో ఆడిస్తే బాగుండేది AB De Villiers : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు వినబడుతోంది. ఈ యువ సంచలనం అరంగ్రేటం కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఆడిస్తారు అని అనుకుంటే అలా జరగలేదు. పోనీ ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనైనా ఆడిస్తారని అనుకుంటే అలా కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో వైభవ్ అరంగ్రేటం పై క్రికెట్ ప్రపంచం రెండుగా చీలీపోయింది. అతడిని వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌ను అలవాటు చేయాలని సూచిస్తున్నారు. సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో వైభవ్ అరంగ్రేటానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదనేది ఇంకొందరి వాదన. IND vs SL : ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. షెడ్యూల్ ఫిక్స్.. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పూర్తి సిద్ధంగా ఉన్నాడని, అందులో ఎలాంటి సందేహం లేదని టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే తెలిపాడు. అయితే.. మూడు నెలల క్రితమే టీమ్ఇండియా మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని మరిచిపోవద్దని చెప్పుకొచ్చాడు. అరంగ్రేటం చేయడానికి అందరికి ఒకటే ప్రాసెస్ ఉంటుందని తెలిపాడు. కాగా.. డస్కటే వ్యాఖ్యలపై ఏబీ డివిలియర్స్ విభేదించాడు. వైభవ్ కు ఇంకా తుది జట్టులో అవకాశం రాకపోవడం నిజంగా దురదృష్టకరమన్నాడు. ఐర్లాండ్‌తో సిరీస్ అతడికి మంచి అవకాశ అని, అయినప్పటికి ఆడించలేదన్నాడు. ఇంకెప్పుడు అతడిని ఆడిస్తారని ప్రశ్నించాడు. ఐపీఎల్లో అతడి ఆటను చూసిన తరువాత ఇతర ఆటగాళ్ల మాదిరిగానే వైభవ్ కూడా అరంగ్రేట ప్రక్రియను అనుసరించాల్సిందేనని భారత అసిస్టెంట్ కోచ్ చెప్పిన మాటతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. Sanju Samson : ఆ మూడు ఇన్నింగ్స్‌లతో ఇంకెన్నాళ్లు సంజూ శాంసన్.. ఇక చాలు.. 'ఐర్లాండ్ వంటి చిన్న జట్లపై ఆడిస్తే వైభవ్‌కు కాస్త అనుభవం వచ్చేది. ఆ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. ప్రస్తుతం భారత జట్టు బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. యూకేలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఐపీఎల్లో లాగా అక్కడ 250, 260 పరుగులు చేయడం కుదరదు. అక్కడి పిచ్‌ల పై కొన్ని సార్లు 140 లేదా 160 స్కోరు కూడా మంచి స్కోరు అవుతుంది.' అని డివిలియర్స్ అన్నాడు.