తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలను, వినూత్నమైన కంటెంట్‌ను ప్రోత్సహించడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా డిజిటల్ స్క్రీన్‌పై అలరిస్తున్న ఒక ఫీల్ గుడ్ సిరీస్‌ను అభినంది
స్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘బేబీ’ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యువ నటుడు విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన తాజా ఎమోషనల్ వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' వేదికగా శుక్రవారం (జూలై 3) నుంచి స్ట్రీమింగ్ అవుతూ, డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.* కియారా - చరణ్ ముచ్చటగా మూడోసారి.. బ్యాడ్ సెంటిమెంట్‌ని సుక్కూ బ్రేక్ చేస్తాడా?స్కూల్ డేస్ మెమొరీస్.. ఎమోషనల్ రోలర్ కోస్టర్!'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ ప్రధాన కథాంశం ఎంతో సున్నితమైన భావోద్వేగాలతో కూడుకున్నది. పెళ్లికి సిద్ధమౌతున్న ఒక యువకుడు, ప్రమాదవశాత్తు తన గతాన్ని, జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను కోల్పోతాడు. ఆ తర్వాత తన చిన్ననాటి స్మృతులను, కోల్పోయిన ఆ జ్ఞాపకాలను తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ సిరీస్‌ను దర్శకుడు వినోద్ గాలి మలిచారు. ఈ కథ వీక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాలకు, మధురమైన స్కూల్ డేస్ రోజులకు తీసుకెళ్లే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లా ఉందంటూ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. చిత్ర బృందానికి బన్నీ స్పెషల్ విషెస్గతంలో ‘చావు కబురు చల్లగా’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ చంద్ర నాయుడు 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ ద్వారా తొలిసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారి సరికొత్త అడుగు వేశారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్ర నాయుడుని ప్రత్యేకంగా అభినందిస్తూ అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.* 'ఈసారి గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొట్టాలి'... అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్ "గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నాను. నా ప్రియమైన శరత్ చంద్రకు, చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. నువ్వు ఒక నిర్మాతగా నీ మొదటి అడుగు వేయడం చూడటం నాకు ప్రత్యేకంగా చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ అందమైన సిరీస్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ప్రశంసలతో పాటు గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చిత్ర తారాగణానికి, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సిరీస్‌ను ఈటీవీ విన్లో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ బన్నీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఐకాన్ స్టార్ నుంచి ఇలాంటి సపోర్ట్ లభించడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అల్లు అర్జున్ ప్రాజెక్టులు ఒకవైపు డిజిటల్ కంటెంట్‌ను సపోర్ట్ చేస్తూనే, మరోవైపు అల్లు అర్జున్ తన సంచలన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’తో బాక్సాఫీస్ వద్ద నభూతో నభవిష్యతి అనేలా గ్లోబల్ రికార్డులను తిరగరాశారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. హాలీవుడ్ మేకింగ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, రష్మిక మందానాతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' (వర్కింగ్ టైటిల్) సినిమాకు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.