చివరి సారిగా అడుగుతున్నా.. మాతో వస్తావా? లేదా? కన్న వాళ్లు కావాలా? ఈ అమ్మాయి కావాలా? అని చలపతి అడుగుతాడు. కానీ రాజు మాత్రం సైలెంట్‌గా ఉండిపోతాడు. రేయ్..
మీ నాన్న అడుగుతున్నా అలా సైలెంట్‌గా ఉంటావ్ ఏంట్రా.. మాతో పాటు రా రా అని లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటుంది. ఇక వాడు రాడు లక్ష్మీ.. వాడికి స్వార్థం పెరిగింది.. కన్న వాళ్ల కంటే.. కోట్ల ఆస్తి ఎక్కువైంది.. ఇలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు ఇలా ఏడ్వాల్సిందే.. అని అంటాడు చలపతి. అమ్మా.. నాన్నని తీసుకు వెళ్లు అని రాజు అంటాడు. ఈ రోజు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది.. కానీ నేను చనిపోయినా కూడా నువ్వు నా ఇంటికి రావొద్దు.. నా చితిని కూడా నువ్వు చూడొద్దు అని చలపతి కన్నీరు పెట్టుకుంటాడు. కానీ రాజు మాత్రం నోరు విప్పడు. వెళ్తూ వెళ్తూ ఇందుని చూస్తూ.. ఒకప్పుడు నిన్ను చూసి మా ఇంటికి కోడలివైతే బాగుండనుకున్నా.. కోడలివి అయి నా కొడుకుని నాకు దూరం చేశావ్ అని చలపతి అంటాడు. ఇక చలపతి, లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోతారు.మనం చేస్తున్నది తప్పేమో మీరెందుకు అండి.. వాడితో అంత కోపంగా అలా మాట్లాడారు.. అని లక్ష్మీ అడుగుతుంది. అలా మాట్లాడితే అయినా వాడు మనతో వస్తాడేమో అని అన్నాను.. కానీ వాడు మనతో రాలేదు అని చలపతి బాధ పడుతుంటాడు. మనం చేస్తున్నది తప్పేమో అండి.. ఆ దేవుడే వాడ్ని ఆ ఇంటికి చేర్చాడు.. మనం ఎంతగా వద్దని ప్రయత్నిస్తున్నా.. చివరకు వాడు అక్కడికే చేరాడు.. దేవుడు రాసిన రాత ఇది.. మనం కాదని తప్పు చేస్తున్నామేమో అని లక్ష్మీ అంటుంది. తప్పైనా, ఒప్పైనా సరే నేను ఇదే చేస్తాను అని చలపతి అంటాడు.బయటకు తీసుకు రావాల్సిందే.. వాడు ప్రాణాలతో ఉండటమే మనకు కావాలి.. ఆ కుటుంబంలో వీడు ఉండకపోతే ఏం జరుగుతుంది అంట.. రేఖ ఆస్తి మొత్తాన్ని తీసుకుంటుంది.. అంతే కదా.. మన కొడుకు అయితే ప్రాణాలతో ఉంటాడు కదా.. వాడు లేకపోతే మనం ఉండగలమా? అందుకే తప్పొ ఒప్పో నాకు తెలీదు.. నేను మాత్రం వాడ్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకు రావడానికే ప్రయత్నం చేస్తుంటా అని చలపతి అంటాడు. అలా లక్ష్మీ, చలపతి ఇద్దరూ కూడా రాజు గురించి బాధపడుతుంటారు. ఇంకో వైపు తమ ప్లాన్ ఫ్లాప్ అయిందని రేఖ మీద అందరూ గుర్రుగా ఉంటారు.మనకు ఏం దక్కదు ఏదో చేస్తా అన్నావ్.. ఏదో జరిగిపోతుందన్నావ్.. రాజు గాడు వెళ్లిపోతాడని అన్నావ్.. ఏం జరగలేదు అని భూషన్, ఐశ్వర్య, భ్రమరం ఇలా అందరూ రేఖను నిందిస్తుంటారు. మనం ఈ ఆస్తి కోసం ఎన్నెన్ని ఘోరాలు చేశాం.. ఒకప్పుడు ఎంత చేశాం.. కానీ ఇప్పుడు ఏం చేయడం లేదు.. ఈ రాజు గాడు వచ్చి అన్నీ తారుమారు చేశాడు.. ఆఫీసులోనూ మన అవసరం లేకుండా చేశాడు.. ఇలానే చూసుకుంటూ వెళ్తే మనకు ఏం దక్కదు అని భూషణ్ అంటాడు. దీంతో రేఖకి కోపం వస్తుంది. భూషణ్ అని అరుస్తుంది. అంతే కదా మరి అని భ్రమరం కూడా అంటుంది.బాధగా ఉంటే ఆ ఇందు చూడలేదు.. మనం అనుకున్నది జరగలేదు కానీ.. భీజం అయితే పడింది.. నేను బాధగా ఉంటేనే ఆ ఇందు చూడలేదు.. ఇక రాజు పేరెంట్స్ అలా ఏడుస్తూ వెళ్లడం చూసి ఊరుకుంటుందా? రాజు గాడ్ని అదే బయటకు పంపిస్తుందని రేఖ అంటుంది. అది నీ ముందు మాత్రమే అలా నటిస్తుంది అని ఐశ్వర్య అంటుంది. అది పంపించకపోతే నా దగ్గర నా ప్లాన్ ఉంది లే అని రేఖ అంటుంది. ప్లాన్ ఏంటి? అని భ్రమరం, ఐశ్వర్య ఇలా అందరూ అడుగుతారు. కానీ రేఖ మాత్రం ఆ ప్లాన్ ఏంటో ఎవ్వరికీ చెప్పదు.నువ్వు కూడా ప్రామీస్ చేయించుకున్నావ్.. ఇంకా నువ్వు ఇక్కడ ఉండటంలో ఏ అర్థం లేదు అని రాజుతో ఇందు అంటుంది. ఇక్కడ ఉండేందుకు అర్థం ఉంది.. కారణాలున్నాయి.. అంత ఎందుకు నువ్వు కూడా ప్రామీస్ చేయించుకున్నావ్ కదా అని రాజు అంటాడు. అవును.. అప్పుడు ప్రామీస్ చేయించుకున్నా.. నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది.. కానీ ఇప్పుడు నేనే చెబుతున్నా.. నువ్వు వెళ్లిపో.. నీ పేరెంట్స్‌ని బాధ పెట్టడం బాగోలేదు అని రాజుతో ఇందు అంటుంది. ఇదంతా నాకు మామూలే అని రాజు అంటాడు. మళ్లీ నేను వాళ్లని కూల్ చేసుకుంటాను అని ఇందుతో రాజు చెబుతాడు.ఇదంతా మాకు నార్మలే.. నేను మీ ఇంటికి వచ్చాను కదా.. మీ వాళ్లని చూశాను కదా.. వాళ్లది కల్మషం లేని ప్రేమ.. వారి కన్నీటికి ఏదో ఒక కారణం ఉంటుంది.. వారిని బాధ పెట్టడం సరి కాదు.. నువ్వు వెళ్లు నేనే చెప్తున్నా కదా అని ఇందు అంటుంది. అరే ఇదంతా మాకు నార్మలే.. లైట్ తీసుకో అని రాజు అంటుంది. అలా ఎలా లైట్ తీసుకో అని చెప్తున్నావ్ రాజు అని ఇందు అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: వానపాములు, అడ్డ గాడిదలు.. ప్రభావతి, చింతామణిలకు మీనా స్వీట్ వార్నింగ్.. తిక్క కుదిర్చిన శ్రుతి