
కలెక్టర్... గోదావరి జిల్లాల్లో పిలిచే ఓ రకం మామిడి కాయలు. సాధారణంగా అన్ని మామిడి రకాలు వర్షాలు పడే సమయం అనగా జూన్ నెలాఖరుకు పక్వానికి వచ్చి మామిడి పండ్ల సీజన్ పూర్తి అవుతుంది.
Jul 3 2026 11:29 AM | Updated on Jul 3 2026 11:38 AM
కలెక్టర్... గోదావరి జిల్లాల్లో పిలిచే ఓ రకం మామిడి కాయలు. సాధారణంగా అన్ని మామిడి రకాలు వర్షాలు పడే సమయం అనగా జూన్ నెలాఖరుకు పక్వానికి వచ్చి మామిడి పండ్ల సీజన్ పూర్తి అవుతుంది. కలెక్టర్ రకం మామిడి మాత్రం ఇతర రకాలకు భిన్నంగా చాలా ఆలస్యంగా జూలై మధ్య నాటికి పక్వానికి చేరుకుంటాయి. ఇది ఇతర రకాల కంటే ఆలస్యంగా పూతకు వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కలెక్టర్ మామిడికి తోటపురి, బెంగళూరా, కల్లమై, కిలిమూకు, గిల్లి, సందేర్ష, ముక్కు, ఒట్టు అనే పేర్లతో కూడా ఆయా ప్రాంతాలను బట్టి పిలుస్తారు.
అయితే గోదావరి జిల్లాల్లో కాస్త పొడవుగా నిటారుగా, ఠీవీగా ఉండడం వల్లనేమో ఇక్కడి ప్రజలకు ఈ మామిడిని కలెక్టర్ అని అంటారు. సాధారణంగా ఈ మామిడి కాస్త పులుపు జోడించుకుని తియ్యగా ఉంటుంది. గతంలో ఈ మామిడిని అధికంగా తాండ్ర తయారీలో ఉపయోగించే వారు. సాగు అధికంగా ఉండడంతో జ్యూస్, డ్రింక్‌ల తయారీకి వెళ్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశి్చమ, కాకినాడ జిల్లాల్లో బంగినపల్లితో పాటు ఇతర రకాల మామిడి పండ్ల తరువాత ఈ కలెక్టర్ మామిడి సాగు అధికంగా ఉంటుంది. –మలికిపురం
ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు)
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
ప్రశ్న రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత సంచలన ఆడియో
బాబు అమరావతి VS వైఎస్ జగన్ MAVIGUN.. ఏది నష్టం, ఏది ప్రయోజనం
మెగా స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దసరాకు విశ్వంభర
అవినీతి తిమింగలం.. 2కిలోల బంగారం.. 20 కిలోల వెండి..
వర్షం వస్తే నీళ్లు తోడటానికే వందల కోట్లు ఖర్చవుతుంటే... 2లక్షల కోట్లతో ఇంకేం చేస్తావ్