
పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భక్తులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ప్రయాణం ఓ ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదని, దేశ సంస్కృతి, సమైక్యతలకు ప్రతీక అని ఆయన...
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భక్తులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ప్రయాణం ఓ ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదని, దేశ సంస్కృతి, సమైక్యతలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. జ్యేష్ట పూర్ణిమ రోజున జరిగిన తొలి పూజతో ప్రారంభమైన ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క శివభక్తునికి ప్రధాని తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.హిమాలయాల్లో వెలిసిన బాబా బర్ఫానీ (హిమలింగం) దర్శనం కోసం కోట్లాది మంది భక్తుల జీవితంలో ఒక మరపురాని, అత్యంత పవిత్రమైన అనుభవమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రాష్ట్రాల నుంచి, భిన్న భాషలు మాట్లాడుతూ, రకరకాల సాంప్రదాయాలు అనుసరించే వారు మహాదేవుని దర్శన సంకల్పంతో ఇక్కడికి తరలివస్తారని, ఈ యాత్ర దేశ వైవిధ్యాన్ని, అందులోని ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.దశాబ్దాలుగా అమర్‌నాథ్ బోర్డుతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ యాత్రను ఎంతో సేవా భావంతో నిర్వహిస్తున్నాయని, ఈ ఏడాది కూడా వేలాది మంది సైనికులు, అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలతో పాటు విధుల్లో ఉన్న డాక్టర్లు, వలంటీర్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.ప్రధాని అయిదు సంకల్పాలు..ఈ పవిత్ర యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ప్రధాని కోరారు. అయిదు సంకల్పాలను ప్రతిపాదించారు. ఇందులో..క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ పై తేల్చి చెప్పిన చెల్లి మొదటి సంకల్పం:యాత్ర మార్గంలో పరిశుభ్రతను పాటించడం. క్లిష్టమైన పర్వత ప్రాంతాలలో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా, ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధ్యానత ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛతతో కూడిన వాతావరణమే దైవత్వానికి నిజమైన నిదర్శనమని తన సందేశంలో తెలిపారు.రెండో సంకల్పం:పర్వత ప్రయాణంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నది ప్రధాని రెండో సంకల్పం. వర్షాలు, హఠాత్తుగా కురిసే మంచు వల్ల ఏర్పడే జారుడును గమనిస్తూ, శీతల వాతావరణానికి తగిన దుస్తులు ధరించాలని గుర్తుచేశారు. రక్షక దళాలు ఇచ్చే సూచనలను పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టి క్షేమంగా ఇళ్లకు చేరవచ్చని యాత్రికులకు వివరించారు.హిమాలయలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం, క్లిష్టమైన కొండ దారులు ఉండటం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని మోదీ హెచ్చరించారు. యాత్ర మార్గంలో అందుబాటులో ఉన్న మెడికల్ క్యాంపులు, వైద్యుల సలహాలను ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాలని భక్తులను కోరారు. శారీరక దృఢత్వంతో పాటు సహనం కూడా ఈ భక్తి మార్గంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్మూడో సంకల్పం..స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మూడో సంకల్పంగా ప్రధాని పేర్కొన్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో భాగంగా ప్రతి యాత్రికుడు తన మొత్తం ప్రయాణ వ్యయంలో కనీసం 10 శాతం మొత్తాన్ని స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు కేటాయించాలని కోరారు. ఇది జమ్మూ కశ్మీర్‌లోని ఎంతో మంది కుటీర పరిశ్రమల కళాకారులకు, వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ చిన్న సహాయం జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని ఎన్నో పేద కుటుంబాలకు, యువతకు కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తుందని అన్నారు.నాలుగో సంకల్పం..పర్యావరణ హితంగా యాత్ర ముగించడానికి ఓ చక్కటి ప్రణాళికను ప్రధాని నాలుగో సంకల్పంగా ప్రతిపాదించారు. యాత్ర ముగింపు రోజైన రక్షాబంధన్ పండుగ నాడు ప్రతి ఒక్కరు తమ సోదరులకు లేదా సోదరీమణులకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తద్వారా ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని విజయవంతం చేసి, పచ్చదనం పెంచాలని యాత్రికులకు సూచించారు.అయిదో సంకల్పం..నైతిక ప్రవర్తనను, దేశ సేవా భావాన్ని పెంపొందించుకోవడమే అయిదో సంకల్పమని ప్రధాని నినదించారు. నేషన్ ఫస్ట్ లేదా దేశమే ప్రథమమనే అంకితభావంతో ప్రతి పౌరుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. నిబద్ధతతో కూడిన పౌర విధులను నిర్వర్తించడం ద్వారా స్వయంసమృద్ధ భారతదేశాన్ని, తద్వారా వికసిత భారత్ ఆశయాలను సులభంగా సాధించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భక్తులలో సరికొత్త దేశభక్తిని నింపారు.