
ఎక్కడో ఉండి ఏదో ఆలోచిస్తాం. రకరకాల వ్యాపకాల్లో మునిగిపోయి అన్యమనస్కంగా ఉంటాం. ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లపై శ్రద్ధ పెట్టి చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నాం.
దృష్టిని ఆకర్షించే ఈ ఫీచర్లు మనలో ఒత్తిడిని పెంచి, ఉత్పాదకతను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మన ఏకాగ్రతను తిరిగి పొందడానికి మార్గాలున్నాయని వివరిస్తున్నాయి.
మనిషి మెదడులోని కొన్ని ప్రాంతాల నెట్వర్క్ మన శ్రద్ధను నియంత్రిస్తుంది. దానివల్ల మనం సంబంధిత సమాచారంపై దృష్టిపెట్టి, మిగతా వాటిని నియంత్రిస్తాం. మన లక్ష్యాలు ఏంటి? చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది? అనే వాటి మధ్య సమతుల్యతే మన దృష్టిని మళ్లిస్తుంది. దీనిఅర్థం, ఆకస్మిక లేదా అత్యవసర సంఘటనలు మన దృష్టిని ఆకర్షించి అప్పటికే చేయాలనుకుంటున్న పని నుంచి దూరం చేస్తాయి. పరిణామ దృక్కోణం నుంచి చూస్తే.. ఇది మనల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు పండ్ల కోసం వెతుకుతున్నప్పుడు చెట్టు ఆకులు గలగలమనే శబ్దం విన్నట్లు ఊహించుకోండి. ఆ శబ్దం మీ దృష్టిని ఆకర్షించి.. మన ఏకాగ్రతను ఆహారం వెతకడం నుంచి సంభావ్య ప్రమాదం వైపు మళ్లిస్తుంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై పోస్టులు, లైక్‌లు లాంటివి ఓ పనిపై మన ఏకాగ్రతకు అంతరాయం కలిగిస్తుంటాయి. ఇది మన ప్రాథమిక దృష్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా కాదు, కానీ మనం పనుల మధ్య మారే తరచుదనాన్ని పెంచడం ద్వారా! మల్టీటాస్కింగ్పై అపోహ ఏమిటంటే.. మనం ఒకేసారి రెండు కష్టమైన పనులను చేయగలమని. అయితే, మన శ్రద్ధకు పరిమితమైన సామర్థ్యం ఉంటుంది. అంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్నీ మనం ఏకకాలంలో గ్రహించలేం. మల్టీటాస్కింగ్ అంటే వాస్తవానికి టాస్క్ స్విచింగ్, అంటే రెండు పనులను ఒకేసారి చేయకుండా.. వాటి మధ్య వేగంగా మారడం. ఓ పని ఎంత సుపరిచితమైనా.. టాస్క్ స్విచింగ్ అనేది మనం ఒకటి లేదా రెండు పనులను చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని చిన్న జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా మన శ్రద్ధ కండరాలను పెంపొందించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.