
ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్టాల్,...
ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరింది. యాత్ర ప్రారంభమైన మొదటిరోజే భారీ వర్షం కురవడంతో కొండమార్గాలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా మంచు లింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. గురువారం 4,882 మంది యాత్రికులతో కూడిన తొలి బృందాన్ని భాగవతి నగర్ యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 3800 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఈ ఉదయం బయలు దేరింది. మరోవైపు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలను మోహరించారు. గగనతల నిఘాను సైతం ఏర్పాటు చేశారు. ఈ వార్త చదివారా: రక్తదాతలకు రుద్రుడి కటాక్షం