
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రధాని సనాయె తకాయిచి (Japan PM Sanae Takaichi) భారత పర్యటనలో ఉన్నారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం తకాయిచికి...
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రధాని సనాయె తకాయిచి (Japan PM Sanae Takaichi) భారత పర్యటనలో ఉన్నారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం తకాయిచికి ప్రధాని మోదీ గౌరవ విందు ఇచ్చారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘సంతూర్’ వాయిద్యాన్ని వాయించాలని ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆమెను కోరారు. అందుకు మొదట ఆమె ఇబ్బంది పడగా.. ఆ వాయిద్యాన్ని ఎలా వాయించాలో మోదీ చూపించారు. అనంతరం ఆమె సరదాగా సంతూర్ను వాయించడంతో ప్రధాని సహా అక్కడున్న వారంతా అభినందించారు. ఈ వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గురువారం తకాయిచితో సమావేశం అనంతరం మోదీ (PM Modi) మాట్లాడుతూ ఆమెను తన చిట్టి చెల్లిగా అభివర్ణించారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు. మోదీ ఆత్మీయ పిలుపుపై తకాయిచి సంతోషం వ్యక్తంచేశారు. చర్చల్లో భాగంగా ఆర్థిక భాగస్వామ్య చట్టం రూపొందించుకోవడంతో పాటు సైనిక ఆయుధ సంపత్తిని కలిసి అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లలోనూ పరస్పర సహకారం వంటి విషయాలు చర్చించినట్లు మోదీ వెల్లడించారు. ఇదీ చదవండి:గింగిరాలు తిరిగే చోట.. ఉంగరాల వేడుక!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.