
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shani Nakshatra Gochar 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ముఖ్యంగా కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడి కదలికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు.. తాజాగా జూలై 2 గురువారం ఉదయం 8:22 గంటలకు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చుకుని రేవతి నక్షత్రంలోకి సంచారం చేశాడు.. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. బుద్ధి కారకుడైన బుధుడు, కర్మఫల ప్రదాత అయిన శని దేవుడి కలయిక వల్ల ఏర్పడే ఈ ప్రత్యేక సమయం కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాలతో పాటు, అదృష్టాన్ని తీసుకురాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా 4 రాశుల వారి జీవితాలు మలుపు తిరగబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో వీరికి తిరుగులేని విజయాలు దక్కబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ సమయం అత్యంత కీలకమైనదిగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని రీతిలో భారీ లాభాలు కలుగుతాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగవంతం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా విలువైన వస్తువును లేదా ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. గతంతో పోలిస్తే.. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రిటర్న్స్ పొందుతారు. వ్యాపార విస్తరణకు ఇది ఎంతో అనుకూలమైన సమయం.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. ఉద్యోగ రీత్యా లేదా వృత్తిపరమైన కారణాల వల్ల సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇవి వీరికి ఎంతో లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగులు తమ కార్యాలయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సమాజంలో మీ ప్రతిష్ట, కీర్తి పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీపై నమ్మకంతో పెద్ద బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి (Scorpio) వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో సుఖసంతోషాలతో పాటు సంపదలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల త్వరలోనే నెరవేరబోతోంది. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు లేదా కోర్టు కేసులు ఏవైనా ఉంటే.. అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో లేదా బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో ఏదైనా పెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది. దీనివల్ల మీ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius) ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక పురోభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో.. ఆత్మీయులతో బంధాలు మరింత బలోపేతం అవుతాయి. పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. జీవితంలో భోగభాగ్యాలు, విలాసాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు చేసే సుదూర ప్రయాణాలు అఖండ లాభాలను తెచ్చిపెడతాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది. కార్యాలయంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.