
ఒంటి నిండా నగలు దిగేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క రాణి హారం వేసుకుంటే మహారాణిలా మెరిసిపోతారు. ఈ రాణి హారాల్లో ఓవర్ సైజ్డ్ పెండెంట్, జాలి, మీనాకారి డిజైన్లు చాలా ఉన్నాయి.
యాంటిక్ ప్యాట్రన్ లో ఉండే ఇలాంటి హెవీ పెండెంట్ రాణి హారాన్ని చోకర్ తో కలిపి ట్రై చేయండి. ఇది మీ లుక్ ని మరింత అందంగా మారుస్తుంది. పెళ్లిళ్లకు ఈ హారాలు వేసుకుంటే చాలా బాగుంటుంది.
జాలి వర్క్‌తో ఉండే రాణి హారం కూడా మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. దీన్ని చీరలు, లెహంగాలు, సల్వార్ సూట్లతో పాటు ఏ ట్రెడిషనల్ డ్రెస్‌పైన అయినా వేసుకోవచ్చు. ఇది మీకు క్లాసీ లుక్‌ను ఇస్తుంది.
మీకు హెవీ లుక్ కావాలంటే ఇలాంటి రాణి హారాన్ని ఎంచుకోవచ్చు. ఈ మల్టీ కలర్ పర్ల్-స్టోన్ రాణి హారాలు మీకు ట్రెండీ, స్టన్నింగ్ లుక్‌ను అందిస్తాయి. పట్టుచీరలకు క్లాసీ లుక్ ని ఇస్తుంది.
ఈ హారాన్ని మీనాకారి టెక్నిక్‌తో తయారు చేస్తారు. ఇందులో సన్నని బంగారు పలకలపై రంగురంగుల మీనా వర్క్ చేస్తారు. దీనిపై ముత్యాలను అందంగా పొదిగి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.
ఓవర్సైజ్డ్, గోల్డెన్ పాలిష్ లుక్‌లో ఉండే ఇలాంటి గ్రీన్ కుందన్ స్టోన్ రాణి హారాన్ని మీరు కూడా కొనొచ్చు. ఇది మీ చీరలకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. రాయల్ లుక్ మీ సొంతమవుతుంది.
మీకు ట్రెండీ, స్టైలిష్ ఆప్షన్ కావాలంటే, చోకర్ ప్యాట్రన్‌తో వచ్చే ఇలాంటి స్టోన్ రాణి హారాన్ని ధరించాలి. ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్లు కూడా దొరుకుతాయి.
Gold Plated Haar : గోల్డ్ ప్లేటెడ్ హారాలు...బంగారం కాదంటే ఎవరూ నమ్మరు
Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి
Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి