
తాను ఆర్థిక శాస్త్రం చదివినప్పటికీ, పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరగడం మాత్రమే కాకుండా, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తోందన్నదే ప్రభుత్వానికి అసలైన కొలమానమని స్పష్టం చేశారు. డేటా ఆధారిత పాలన, సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ‘ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్’ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.పేదల జీవితాల్లో మార్పు కోసమే పాలనఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జీఎస్డీపీ, సీఏజీఆర్ వంటి ఆర్థిక సూచికలను విశ్లేషిస్తూనే, వాటి ఫలాలు ప్రజల జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తున్నాయో చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవలే గూడూరులో తాను పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మ కుటుంబాల స్థితిగతులను ఉదాహరణగా చూపుతూ, ప్రభుత్వ పథకాలు వారి జీవితాల్లో తెచ్చిన మార్పును సవివరంగా తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటున్నాయో వివరించారు.దార్శనికతతో ముందుకు..దేశంలోనే తొలిసారిగా విజన్-2020 రూపొందించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని, కానీ భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి పనిచేశామని గుర్తు చేశారు. ఐటీ విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి, సేవల రంగంలో అపార అవకాశాలు సృష్టిస్తుందని అప్పుడే విశ్వసించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే