
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆమె తన ప్రియుడు, స్క్రీన్‌రైటర్ రోహన్ థక్కర్‌ను పెళ్లాడబోతున్నారు.
వీరి వివాహం జులై 6న జరగనున్నట్లు బోనీ కపూర్ స్వయంగా ధృవీకరించారు. రెండు కుటుంబాల సంప్రదాయాలను మిళితం చేస్తూ, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను ఒక్క రోజులోనే పూర్తి చేయనున్నారు.ఈ పెళ్లి వేడుకలు జూన్ 21న 'మాతా కీ చౌకీ'తో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుడి కుటుంబం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కపూర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు కుటుంబ సభ్యులంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అన్షులా, అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.అన్షులా, రోహన్ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. గతేడాది జులైలో న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 2025 అక్టోబర్‌లో ముంబైలో వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగింది.వివాహం అనంతరం సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక కాక్టెయిల్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు 'మోడరన్ ఇండియన్' డ్రెస్ కోడ్ పాటించాలని నిర్వాహకులు కోరారు.