
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
DA Arrears: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం అందించే నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వారి డిమాండ్లను కూడా వేతన సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ.. ఉద్యోగ సంఘాల నుంచి సూచనలు స్వీకరిస్తోంది. అనంతరం వాటిపై చర్చిస్తోంది. అటు ఉద్యోగ సంఘాలు కూడా వేతన సంఘం ముందు తమ డిమాండ్లను బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పెండింగ్ లో ఉన్న 18 నెలల డిఏ, డిఆర్ బకాయిలను తిరిగి ఇవ్వాలని వేతన సంఘం ముందు డిమాండ్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా మూడు వాయిదాల్లో చెల్లించాల్సిన డీఏను ప్రభుత్వం నిలిపివేసింది.
1 జనవరి 2020 నుండి 30 జూన్ 2020 వరకు , జూలై 1, 2020 నుండి సెప్టెంబర్ 31, 2020 వరకు , 1 జనవరి 2021 నుండి 30 జూన్ 2021 వరకు, ఈ 18 నెలల కాలంలో.. డిఏను నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం రూ. 34,402.32 కోట్లు ఆదా చేసింది. అయితే ఈ డబ్బును ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగించినట్లు గతంలోనే పేర్కొంది. ఇప్పుడు.. ఉద్యోగ సంఘాలు, సంస్థలు ఈ బకాయిలను విడుదల చేయాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆ 18 నెలల డిఏ, డిఆర్ బకాయిలు విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రం పార్లమెంట్ లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నెలకొన్న ఆర్థిక ఒత్తిడి కారణంగానే డియర్నెస్ అలవెన్స్‌ను మూడు విడతలుగా నిలిపివేశామని ప్రభుత్వం సభలో ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం.. ఆ కాలానికి సంబంధించిన బకాయిలను విడుదల చేసేందుకు ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదు. బడ్జెట్‌పై ప్రస్తుతం ఉన్న ఒత్తిడి దృష్ట్యా, పాత 18 నెలల కరువు భత్యాన్ని చెల్లించడంలో అర్థం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్‌లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన నివేదికను సమర్పించేందుకు సంఘానికి 18 నెలల సమయం ఇచ్చింది. తన నివేదికను 2027 మే నాటికి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అయితే ఈ నివేదిక అందిన తర్వాత.. దానిని కేంద్రం సమీక్షిస్తుంది. అనంతరం కేబినెట్ ఆమోదంతో దీన్ని 2027మధ్య చివరి నాటికి పూర్తిగా అమలు చేసే అవకాశం ఉంది. కోవిడ్ సమయంలో చెల్లించాల్సిన 18 నెలల బకాయిల గురించి ఉద్యోగసంఘాలు మరోమారు వేతన సంఘం ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇఫ్పుడు పరిస్థితులు సద్ధుమణిగిన నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఉద్యోగ సంఘాల ఈ డిమాండ్ ను ప్రభుత్వం మరోసారి పునపరిశీలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కేంద్రం ఈ అంశంపై మరోసారి పునఆలోచన చేసినట్లయితే ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీగా నిధులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.