
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరను తగ్గించింది. అయితే14.
2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం తొలగిపోవడంతో త్వరలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలగనుంది.
అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు ఉపయోగించే వాణిజ్య సిలిండర్ల ధరల, వంటగ్యాస్ సిలిండర్ల ధరలు ఒకేలా ఎందుకు ఉండవనే మనకు తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఉంటే.. డొమెస్టిక్ సిలిండర్ల ధరలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ ధరలు ఎలా నిర్ణయిస్తారు..? ప్రభావితం చూపే అంశాలేంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
దిగుమతులు, పన్నులు, సబ్సిడీలు వంటి గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతాయి. భారత్ తన అవసరాల్లో దాదాపు సగం దిగుమతులపై ఆధారపడుతుంది. ఎల్పీజీ కనీస ధర అనేది దిగుమతి సమానతా ధర(IPP)తో ముడిపడి ఉంటుంది. ఐపీపీ అనేది సౌదీ అరేబియా నిర్దేశించిన అంతర్జాతీయ ప్రామాణిక ధరలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎల్పీజీని అమెరికన్ డాలర్లలో కొనుగోలు చేస్తారు. దీంతో రూపాయి, డాలర్ మధ్య మారకపు రేటు ఎఫెక్ట్ కూడా గ్యాస్ ధరలపై ఉంటుంది.
ఇక రవాణా ఛార్జీలు, సముద్ర బీమా, కస్టమ్స్ సుంకం, పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు వంటివి కూడా ప్రభావితం చూపిస్తారు. విదేశాల నుంచి ఎల్పీజీ గ్యాస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా రవాణా చేస్తాయి. రవాణా ఖర్చులు, బాట్లింగ్ ఛార్జీలు, మార్కెటింగ్ ఖర్చులు, డీలర్ కమీషన్లు ఉంటాయి. ఇక స్థానిక పన్నులు, పంపిణీ ఖర్చులు కూడా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. దీంతో వీటి ఆధారంగా గ్యాస్ ధరలను నిర్ణయిస్తూ ఉంటారు.
స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా ధరలు ఉంటాయి. డొమెస్టిక్ సిలిండర్లను ఇంటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. అయితే వాణిజ్య సిలిండర్లను వ్యాపారాలు ఆదాయాన్ని సంపాదించడానికి ఉపయోగిస్తారు. దీంతో వాణిజ్య సిలిండర్లపై ఎటువంటి సబ్సిడీ ఉండదు కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్లపై ప్రభుత్వ సబ్సిడీ అందిస్తోంది. అందుకే వీటి ధరలు తక్కువగా ఉంటాయి.