
Good News To Telangana Govt Teachers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. టీచర్లు, ఉపాధ్యాయులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గంలో ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. వెంటనే ఈ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, అధ్యాపకులు భోజనం చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యాహ్న భోజనం నాణ్యత పెరిగే అవకాశం ఉంది. ఇన్నాళ్లు విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత అనేది పట్టించుకోవడం లేదు. ఇప్పుడు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, లెక్చరర్లు భోజనం చేస్తుండడంతో భోజనం నాణ్యత పెరిగే అవకాశం ఉంది.
కొన్ని కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. పేపర్ లెస్‌గా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ పోలీస్ అధికారుల భద్రతా తొలగింపు, ఉద్యోగులు, పాలనాపరమైన నిర్ణయాలు మంత్రిమండలి తీసుకుంది.