
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold: అంతర్జాతీయంగా బంగారం ధరలు వేగంగా పడిపోతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని వెల్లడైంది. ఇటీవల.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన గోల్డ్ మిడ్-ఇయర్ అవుట్‌లుక్ 2026ని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ అయిన జువాన్ కార్లోస్ ఆర్టిగాస్ ఈ నివేదిక వివరాలను అధికారికంగా ప్రకటించారు.
భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలలో మార్పు వచ్చినా కూడా.. ఒక ఔన్సు బంగారం ధర మళ్లీ 4,500డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. ప్రత్యేకంగా.. బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు డాలర్ విలువ పెరగడం, మార్కెట్లో పెట్టుబడిదారుల రిస్క్-ఆన్ సెంటిమెంట్ అని చెప్పాలి. బంగారం ధరలు 4,000డాలర్ల కంటే తక్కువకు పడిపోతే.. బంగారం ధరలు మరింత తగ్గుదల సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత స్థాయి నుండి బంగారం ధర 10శాతం తగ్గితే.. డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది జనవరిలో.. బంగారం ధరలు 12 కంటే ఎక్కువ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకుని.. కొత్త రికార్డులను నెలకొల్పాయి. జనవరి 23న.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 5,405 డాలర్ల వద్ద సర్వకాలిక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే, జూన్‌లో బంగారం ధరలు మళ్లీ 4,000 డాలర్లకు పడిపోయాయి. ఇది దాదాపు 7శాతం తగ్గుదల అని చెప్పాలి. బంగారం ధరలలో ఈ తీవ్రమైన హెచ్చుతగ్గుల కారణంగా, అస్థిరత సుమారు 30శాతం పెరిగినట్లు గమనించవచ్చు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ పరిస్థితి బంగారం ధరల పెరుగుదలకు దారితీసిందని నివేదిక పేర్కొంది.
ఆ తర్వాత బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం లాభాల స్వీకరణేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. మరోవైపు.. అక్టోబర్ 2026 నాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కనీసం ఒక్కసారైనా వడ్డీ రేట్లను పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంకోవైపు.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్ల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు 4,100 డాలర్ల వద్దే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే, సెంట్రల్ బ్యాంకులు, పెట్టుబడిదారులు, బంగారు ఆభరణాల వినియోగదారులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తూ, ధర మరింత పడిపోకుండా నివారిస్తున్నారని నివేదిక తెలిపింది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.