
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు తీవ్రరూపం దాల్చింది. గురుకుల పాఠశాలల టెండర్లు, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి...
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు తీవ్రరూపం దాల్చింది. గురుకుల పాఠశాలల టెండర్లు, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు, తీరా సమయం వచ్చేసరికి వెనకడుగు వేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం చర్చ కోసం తాము తెలంగాణ భవన్కు చేరుకున్నా, మంత్రి రాకపోవడంపై ఆయన మండిపడ్డారు.గురువారం హరీశ్ రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అదే సమయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గన్ పార్క్ వద్ద ఉన్నారన్న సమాచారంతో వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది."చర్చకు రమ్మని సవాల్ విసిరింది వాళ్లే, తీరా మేము వస్తే పోలీసులను ప్రయోగించి అడ్డుకోవడం చూస్తుంటే, టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే వారు పారిపోయారని స్పష్టమవుతోంది" అని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర అప్పు రూ. 8 లక్షల కోట్ల నుంచి రూ. 7 లక్షల కోట్లకు ఎలా తగ్గిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం ఖాళీ కుర్చీ వేసి వేచి చూశారు. పోలీసుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, భారీ