
గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. 2024లో 11 ఏళ్ల ఓ బాలుడు సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలసి ఒంటారియో వెళ్లాడు. ఓ రోజు ఉదయం అతడు నిద్రలేవగానే.. ముక్కు, నోరుపై గబ్బిలం వాలి ఉండటం గమనించాడు. ఒక్కసారిగా షాక్కు గురైన బాలుడు భయంతో దాన్ని పక్కకు తోసేశాడు.
బాలుడి అరుపులు విన్న తండ్రి అక్కడికి వచ్చాడు. గబ్బిలాన్ని పట్టుకుని దూరంగా వదిలేశాడు. తండ్రి బాలుడి ముఖాన్ని పరీక్షించగా.. ముఖంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. కుటుంబసభ్యులందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, 19 రోజుల తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు మొదలయ్యాయి. ముఖం మొత్తం మొద్దుబారిపోయినట్లుగా అయింది. అతడి ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి రేబీస్ వ్యాధి సోకినట్లు డాక్టర్లు తేల్చారు. బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం ప్రారంభించారు.
అయితే, అప్పటికే వైరస్ మెదడుకు సోకటంతో.. రెండు వారాలు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. అతడి పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కుటుంబసభ్యుల అనుమతితో డాక్టర్లు లైఫ్ సపోర్ట్ తీసేశారు. బాలుడు కొద్దిసేపటి తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఒంటారియోలో గబ్బిలం కారణంగా రేబీస్ వ్యాధి సోకి ఓ మనిషి ప్రాణాలు కోల్పోవటం 50 ఏళ్లలో ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇక, బాలుడి కుటుంబసభ్యులు ఈ సంఘటనపై జనాల్లో అవగాహన కల్పించటం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..
IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు..