రెండు స్పూన్ల శనగపిండిలో అర టీ స్పూన్ పసుపు, కొంచెం పాలు కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి రాయడం వల్ల ఫేసియల్ హెయిర్ తొలగుతుంది.
రెండు స్పూన్ల అరటిపండు గుజ్జులో ఓట్మీల్ కలిపి ముఖానికి రాసుకోండి. తర్వాత సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగుతాయి. ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది.
బొప్పాయి గుజ్జులో పసుపు కలిపి ముఖానికి రాయండి. ఇందులోని పోషకాలు అందాన్ని పెంచుతాయి. అవాంచిత రోమాలను అదుపు చేస్తాయి.
పంచదారలో నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. తర్వాత మాస్క్ తొలగిస్తే ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది.
ఒక గుడ్డు తెల్లసొనలో మొక్కజొన్న పిండి కలిపి ముఖానికి రాయండి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా తొలగించండి. దీంతో అవాంచిత రోమాలు తొలగుతాయి.
బియ్యం పిండిలో పాలు కలిపి ప్యాక్ తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగితే అవాంచిత రోమాలు తొలగుతాయి.
ఒక టేబుల్ స్పూన్ తేనెని, మరో టీ స్పూన్ నిమ్మరసంతో కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మాన్ని అందంగా మార్చుతుంది. అవాంచిత రోమాలు తొలగుతాయి.
బంగాళదుంప రసంలో పెసరపప్పు పేస్ట్ కలిపి ముఖానికి రాయండి. ఇది ఫేసియల్ హెయిర్‌ను తొలగిస్తుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది.
చందనం పొడిలో రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాయండి. కాసేపు అయ్యాక క్లీన్ చేస్తే అవాంచిత రోమాలు తొలగుతాయి.