
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Oppo K14x 5G Flipkart GOAT Sale: మీరు ఎప్పటి నుంచో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే Flipkart GOAT (Greatest Of All Time) సేల్‌లో Oppo బ్రాండ్‌కు సంబంధించిన Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్లు ప్రకటించారు. జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సేల్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మొబైల్‌ను ఎవరూ ఊహించని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రూ.19,999 ఫోన్.. కేవలం రూ.14 వేలకే! సాధారణంగా మార్కెట్లో Oppo K14x 5G (64 GB + 4 GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర (MRP) రూ. 19,999తో అందుబాటులో ఉంది.. కానీ, ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించబోతోంది.. అంటే ఎలాంటి అదనపు బ్యాంక్ ఆఫర్స్ లేకుండానే ఈ ఫోన్ ధర నేరుగా రూ.14,999కే లభిస్తోంది. మిడ్-రేంజ్ బడ్జెట్లో ప్రీమియం లుక్, 5G కనెక్టివిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు.
బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేందుకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ ప్రియులకు భారీ ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఎక్స్ఛేంజ్ బోనస్‌తో రూ.7,899లకే మీ సొంతం.. ఈ సేల్‌లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం. ఈ Flipkart GOAT సేల్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల దాదాపు రూ.6,100 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ మీరు మీ పాత ఫోన్‌పై పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్ పొందితే.. అన్ని ఆఫర్లు అంటే.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలుపుకొని ఈ ప్రీమియం Oppo K14x 5G ఫోన్‌ను కేవలం రూ.7,899 లోపే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండీషన్, స్క్రాచెస్తో పాటు బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.