
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
130 Constitution Amendement bill: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ లోపు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎపుడైనా చేపట్టే అవకాశాలున్నాయి.ఈ సారి కేంద్ర మంత్రి వర్గంలో పనితీరు సరిగా లేని మంత్రులతో పాటు వయసు పై పడిన వారిని క్యాబినేట్ నుంచి తెలిగించనున్నారు. మరోవైపు కొందరిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్స్‌గా పంపనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గవర్నర్స్‌గా పనిచేస్తున్న వారి కాల వ్యవధి ముగిసినందున వారిని ఏ క్షణంలోనైనా మార్చే అవకాశాలున్నాయి. వారి ప్లేస్‌లో ప్రస్తుతం కేంద్ర క్యాబినేట్ మంత్రుల్లో కొందరికి అకామిడేట్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు కొంత మంది కేంద్ర మంత్రలు శాఖల్లో మార్పులు చేర్పుల చేపట్టబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ నెల నుంచి 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో 130వ రాజ్యంగ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలిస్తోంది.వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే JPC నివేదికను సభలో సమర్పించే అవకాశం ఉంది.నివేదిక సమర్పించిన తర్వాత, ఈ బిల్లును ఆమోదం కోసం ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి, దీనికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం అవుతుంది. ఎవరైనా చట్ట సభ్యులు ప్రధాని మంత్రి కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అరెస్ట్ అయి 30 రోజులు రిమాండ్ లో ఉంటే వారిని ఆ పదవి నుంచి తొలిగించేందుకు వీలు కల్పించే బిల్లును ఉభ సభలో ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర నేరారాపణపై అరెస్ట్ అయినా.. కొంత మంది చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ప్రజా ప్రతినిధి అరెస్ట్ అయినపుడు అది ప్రధాని, కేంద్ర మంత్రి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రలు ఎవరినైనా పదవి నుంచి తొలిగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
గత ఆగష్టులో ప్రభుత్వం ఈ బిల్లను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై అపరాజితా సారంగీ నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించారు. తమ అభ్యంతరాలను అధికార బీజేపీ పట్టించుకోవడం లేదంటూ విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు. కమిటీ ఈ నెల 17న భేటి అయి నివేదికను ఆమోదించి 20న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. మరోవైపు డీ లిమిటేషన్, మహిళా బిల్లును కూడా మరోసారి ఈ సమావేశాల్లోనే తీసుకురాబోయే యోచనలో కేంద్ర సర్కారు ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.