
రాష్ట్రం మీద, ప్రజల మీద ద్వేషం పెంచుకున్న జగన్ (Jagan) పూటకో మాట మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) విమర్శించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ మొన్న మూడు రాజధానులు, నేడు మావిగన్ (Mavigan) అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే క్రిమినల్ అజెండాతో జగన్ పని చేస్తున్నాడు. మూడు రాజధానుల పిచ్చి సిద్ధాంతమే గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చింది. మావిగన్ సిద్ధాంతంతో ఇక సింగిల్ డిజిట్ (Single digit) ఖాయం అని విమర్శించారు.