
ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ నడవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా, బరువును అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సులభమైన వ్యాయామం...
ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ నడవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా, బరువును అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సులభమైన వ్యాయామం నడక. అయితే, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే విషయంలో నడక కన్నా ఓ మెట్టు పైనే నిలుస్తుంది మరో సులభమైన వ్యాయామం. అదే 'స్క్వాట్స్'.. అంటే గుంజీలు! రోజులో అప్పుడప్పుడు చేసే కొన్ని స్క్వాట్స్.. ఒకేసారి అరగంట పాటు చేసే నడక కన్నా మెరుగైన ఫలితాలు ఇస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.2024లో ప్రచురితమైన "ఎన్హాన్స్డ్ మజిల్ యాక్టివిటీ డ్యూరింగ్ ఇంటరప్టెడ్ సిట్టింగ్ ఇంప్రూవ్స్ గ్లైసెమిక్ కంట్రోల్ ఇన్ ఓవర్‌వెయిట్ అండ్ ఒబేస్ మెన్" అనే పేరుతో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న 18 మంది పురుషులను ఎంపిక చేసి, వారిపై పరిశోధన జరిపారు. వారిని నాలుగు గ్రూపులుగా విభజించి వేర్వేరు పనులు అప్పగించారు. ఒక బృందాన్ని కదలకుండా కూర్చోబెట్టగా, రెండో బృందంతో ఒకేసారి 30 నిమిషాలు నడిపించారు. మూడో బృందంతో ప్రతి 45 నిమిషాలకు చిన్న వాకింగ్ బ్రేక్ ఇప్పించగా, నాలుగో బృందంతో ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్స్ చేయించారు.ఫలితాలను విశ్లేషించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. కదలకుండా కూర్చున్న వారితో పోలిస్తే, ఏ రకమైన వ్యాయామం చేసినా ప్రయోజనం కనిపించింది. అయితే, ఒకేసారి అరగంట నడిచిన వారితో పోల్చినప్పుడు, ప్రతి 45 నిమిషాలకు పదేసి స్క్వాట్స్ చేసిన వారిలో భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు సుమారు 40