
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తన జోరును కొనసాగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రీమియం ప్లాట్ల వేలాలు, మరోవైపు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిలలో నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలం విజయవంతం కావడం మార్కెట్లోని సానుకూల ధోరణికి అద్దం పడుతోంది.మోకిల ఫేజ్-3లో భాగంగా 100 నివాస ప్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ-వేలానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹231.65 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గజానికి కనీస ధర ₹50,000గా నిర్ణయించగా, గరిష్ఠంగా ఒక ప్లాటు గజానికి ₹1,09,500 పలికింది. సగటున గజం ధర ₹75,640గా నమోదైంది. బంజారాహిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనూ ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేయడం, పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన విశ్వాసాన్ని సూచిస్తోంది.మెట్రో విస్తరణపై కీలక అడుగులుఒకవైపు ప్రభుత్వం ప్రీమియం భూముల అమ్మకాల ద్వారా నిధులు సమీకరిస్తుండగా, మరోవైపు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 టేకోవర్, ఫేజ్-2 విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)ను కన్సల్టెంట్గా నియమించాయి. "ఎస్బీఐ క్యాప్స్ సంస్థ మెట్రో రైల్ ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణ, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకుంటాయి,"