చింటుని, సుగుణమ్మని మనోజ్ కారులో డ్రాప్ చేస్తాడు. అప్పటికే సత్యంని డ్రాప్ చేసేందుకు బాలు, మీనా స్కూల్ వద్దకు వస్తారు. మళ్లీ పికప్ చేసుకుంటాం.. అంత వరకు ఇక్కడే గుడిలో దర్శనం చేసుకుంటాం..
మళ్లీ వస్తాం నాన్నా అని బాలు అంటాడు. బాలు, మీనా వెళ్లిపోతోన్న టైంలోనే మనోజ్‌ని అక్కడ చూస్తారు. వీడేంటి చింటుని డ్రాప్ చేశాడు అని అనుకుంటారిద్దరూ. ఇక సుగుణమ్మ జరిగిన విషయం అంతా చెబుతుంది. మా లక్షలు మింగినోడికి ఇంత మంచి మనసు ఉందా? అని బాలు అనుకుంటాడు. ఈ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది కదా.. చింటు వాళ్ల అమ్మ రాలేదా? అని బాలు అడుగుతాడు. ఇక్కడ లేదు.. విదేశాల్లో జాబ్ చేస్తోంది అని సుగుణమ్మ చెబుతుంది. అదేంటి? చింటుగాడ్ని జాయిన్ చేసిందే వాళ్ల అమ్మ అని చెప్పారు కదా అని బాలు అడుగుతాడు. జాయిన్ చేసి వెళ్లిందని కవర్ చేస్తుంది సుగుణమ్మ. సరే మాకు టైం అవుతోందంటూ అక్కడి నుంచి జారుకుంటుంది సుగుణమ్మ. ఏదో తేడాగా ఉంది అని బాలు, మీనా అనుకుంటారు. కావాలనే మన నుంచి తప్పించుకోవాలన్నట్టుగా చేస్తున్నట్టు అనిపిస్తోందని మీనా అనుమానిస్తుంది.వేషం మార్చిన రోహిణి.. చింటు గాడి పేరెంట్స్ టీచింగ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వడానికి రోహిణి వేషం మార్చుకుంటుంది. కొత్త విగ్గు పెట్టుకుంటుంది. కళ్లద్దాలు పెట్టుకుంటుంది. గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్ కూడా పెట్టుకుంటుంది. వీడియో కాల్లో ఇవన్నీ మేనేజ్ చేస్తావ్.. చూస్తే గుర్తు పట్టరు.. కానీ నీ గొంతు వింటే మీ మామయ్య గుర్తు పడతాడు కదా? అని విద్య అంటుంది. అందుకే కదా నువ్వు నాకు డబ్బింగ్ చెప్తావ్.. అని రోహిణి అంటుంది. అంటే నా డబ్బింగ్, నీ యాక్షన్ కలపాలా? నాకు టెన్షన్‌గా ఉంటుంది.. ఏం మాట్లాడాలో తెలీదు అని విద్య కంగారు పడుతుంది.మధ్యలో దగ్గులు, తుమ్ములు.. వీడియో కాల్లో రోహిణిని చూసి చింటు గాడు.. మా అమ్మలా లేదే.. అని అంటాడు. దీంతో సుగుణమ్మ కంగారు పడి.. ఏం మాట్లాడకు అని తిడుతుంది. ఇక చింటుగాడి గురించి ప్రిన్సిపాల్ చెబుతుంటే.. ఓకే మేడం.. సరే మేడం అని విద్య డబ్బింగ్ చెబుతుంటే రోహిణి తలూపుతూ ఉంటుంది. విద్యకు మధ్యలో దగ్గులు, తుమ్ములు వస్తుంటాయి. అవి మ్యానేజ్ చేయలేక రోహిణి సతమతం అవుతుంటుంది. సరే మీకు హెల్త్ సరిగ్గా లేదని అనుకుంటా.. ఇక్కడకు వచ్చినప్పుడు స్కూల్‌కి రండి అని చెప్పి వీడియో కాల్ కట్ చేస్తుంది ప్రిన్సిపాల్.భలే నటించావ్ ఏంటే.. నీకు మధ్యలో దగ్గులు, తుమ్ములు వస్తున్నాయ్ అని విద్య మీద రోహిణి ఫైర్ అవుతుంది. అది నా తప్పా? నేను ఏమైనా కావాలని చేశానా? అని అంటుంది. మొత్తానికి గండం గట్టెక్కాం.. అని రోహిణి అంటుంది. ఇంకోసారి కూాడా నన్నే వాడతావా? తల్లి అని విద్య అంటుంది. అసలు ఇంకోసారి ఇలాంటి ఓ పరిస్థితి రాకూడదు అని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని రోహిణి అంటుంది. భలే నటించావ్ అని రోహిణిని విద్య అంటే.. నీ డబ్బింగ్ లేకపోతే కష్టం అయ్యేది అని రోహిణి అంటుంది. చివరకు ఇద్దరూ ఏదో సాధించేసినట్టుగా పగలబడి నవ్వేసుకుంటారు.మనోజ్‌కి, కల్పనకు పుట్టి ఉంటాడేమో.. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిందా రా చింటు అని బాలు అడుగుతాడు. అయింది అంకుల్.. కానీ మా అమ్మే అమ్మలా లేదు.. జుట్టు కత్తిరించుకుంది.. కళ్ల జోడు పెట్టుకుంది.. మాస్క్ కూడా పెట్టుకుంది అని చింటుగాడు మొత్తం చెప్పేస్తాడు. దీంతో సుగుణ కంగారు పడుతుంది. అదేంటి? అని బాలు అడిగితే.. కంపెనీలో రూల్స్ అలానే ఉంటాయట బాబు అని చెప్పి కంగారు కంగారుగా చింటుగాడ్ని తీసుకుని వెళ్తుంది సుగుణమ్మ. ఏదో తేడాగా ఉంది.. అన్నింటికీ సమాధానాలు చెబుతోంది.. కానీ కళ్లలో భయం కనిపిస్తోంది.. అని బాలు అంటే.. చింటు గాడు మనోజ్‌కి, కల్పనకు పుట్టి ఉంటాడేమో అని మీనా అనుమానిస్తుంది.అనుమానించిన మీనా.. కచ్చితంగా మనోజ్‌కి, కల్పనకే పుట్టి ఉంటాడు.. అని మీనా అంటుంది. చింటుగాడికి ఐదారేళ్లు ఉంటాయి.. కల్పన మ్యాటర్ రెండేళ్ల నుంచే ఉంది.. అలాంటప్పుడు ఇంత పెద్ద కొడుకు ఎలా ఉంటాడు అని బాలు అంటాడు. మనకు నిజం చెప్పి ఉంటాడని గ్యారెంటీ ఏంటి.. నాకు అయితే కచ్చితంగా మనోజ్, కల్పనకు పుట్టిన వాడే అని అనిపిస్తోంది.. పైగా విదేశాల్లో అమ్మ ఉంటుందని చెప్పడం, ఉదయం కారులో డ్రాప్ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానంగానే ఉందని మీనా అంటుంది. సరే ఏది నిజమో కనిపెడదాం అని బాలు అంటాడు.మనోజ్ మీద మరింత అనుమానం.. ఫోన్లో చూస్తూ బిజీగా నడుస్తూ వస్తూ ప్రభావతికి డ్యాష్ ఇచ్చి పడిపోతుంది శ్రుతి. ఈ మధ్య అందరూ ఇలానే.. అరచేతిలోనే ప్రపంచం ఉంటోంది.. చింటు వాళ్ల అమ్మ.. వీడియో కాల్ అని మాస్క్ కూడా పెట్టుకుని కనిపించింది.. అని సత్యం టాపిక్ తీస్తాడు. దీంతో బాలు, మీనాలు మనోజ్ మీద ఓ కన్నేసి పెడతారు. ఆఫీసులో రూల్స్ అలా ఉన్నాయేమో అని మనోజ్ వెనకేసుకుని వస్తాడు. దీంతో వారిద్దరికీ మరింత అనుమానం వస్తుంది. వాళ్ల నాన్న ఎక్కడున్నాడో అని మీనా అంటుంది. ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడు.. అందుకే అమ్మ వచ్చినట్టుందని మనోజ్ అంటాడు.రోహిణియే చింటు అమ్మ.. ఏ ఉపయోగం లేనిదే నువ్వు దేంట్లోనూ దూరవు కదా? అని మనోజ్‌ను నిలదీస్తాడు బాలు. రోహిణియే చింటు గాడి అమ్మ.. అని మనోజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. అనుకో.. నీకు బాగా లేకపోతే.. మాస్క్ పెట్టుకుని వెళ్తావా? లేదా? అని మనోజ్ అడుగుతాడు. మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావ్.. అని రోహిణి కంగారు పడుతుంది. సరే.. నువ్వే చింటుగాడి నాన్నవి అనుకో.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని బాలు అంటాడు. ఆ ఊహే ఎంత బాగుందో అని మనోజ్ అనుకుంటాడు. దీంతో ప్రభావతికి కోపం వస్తుంది.దిక్కు మాలిన కుటుంబం.. అదొక దిక్కు మాలిన కుటుంబం.. అమ్మకి నాన్న లేడు.. ఆ చింటుగాడికి నాన్న లేడు.. అమ్మ ఉన్నా లేనట్టే.. ఎవ్వరికీ కనిపించదు.. ఎక్కడో ఎవడ్నో చేసుకుని వీడ్ని ఇక్కడ ఇలా వదిలేసినట్టు ఉంది అని ప్రభావతి అంటుంది. దీంతో రోహిణికి కోపం వస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది. అలాంటి దిక్కు మాలిన కుటుంబం, పనికి మాలిన వాళ్ల గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి.. ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లిపోండి అని ప్రభావతి అంటుంది. కానీ బాలు, మీనాలకు మాత్రం ఇంకా అనుమానాలు బలపడతాయి. మనోజ్ మీదే మీనా ఫోకస్ పెడుతుంది.మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు.. మనోజ్ మాటల్ని బట్టి చూస్తే మరింత అనుమానం కలుగుతోంది.. కచ్చితంగా మనోజ్, కల్పనలకే ఆ చింటు గాడు పుట్టి ఉంటాడు.. కల్పన డబ్బు మ్యాటర్ బయట పెట్టి.. చింటు మ్యాటర్ తెలీకుండా దాచి పెట్టాడు అని మీనా అంటుంది. వాడికి అంత తెలివి తేటలు, సీన్ లేదు అని బాలు అంటాడు. రోహిణికి అన్యాయం చేస్తున్నాడు.. నేను మాత్రం వదిలి పెట్టను అని మీనా అంటుంది. సరే మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు.. అన్నీ సంపాదించి.. అప్పుడు నిజం ఏంటో కనిపెడదాం అని బాలు అంటాడు. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : విడాకులు అడిగిన మహా.. చక్రి గుండె ముక్కలు.. శైలుకి ఇక తిప్పలే