
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary).
ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాలీవుడ్ హీరో ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) వేదికగా జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ వీడియోను విడుదల చేసింది.
మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ఏకంగా రూ.6000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇండియాలోనూ రికార్డులు సృష్టించింది. గతంలో విడుదలైన ‘ఇంటర్స్టెల్లార్’, ‘డ్యూన్ 2’ కంటే ఎక్కువ వసూళ్ల రాబట్టింది. 2025లో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తర్వాత ఇండియన్ ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిన అంతర్జాతీయ చిత్రం ఇదే కావడం విశేషం. గతం మర్చిపోయిన ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఒంటరిగా మానవాళిని రక్షించేందుకు ఎన్ని సాహసాలు చేశాడనే కథతో ఈ చిత్రం రూపొందింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.