
భారతదేశం, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కోరుతూ 117 మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. భారత్, పాక్‌లకు చెంది
న ఈ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లకు ఉమ్మడిగా ఒక లేఖ రాశారు. దౌత్య మార్గాలను తిరిగి తెరిచి, సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ అధినేత ఓపీ షా ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఈ పరిస్థితి ఉపఖండంలోని సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, సాధారణ సంబంధాలు నెలకొంటేనే ప్రజల ఆర్థిక శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలను సంఘర్షణ వైపు నడిపించే ఏ చిన్న సంఘటన అయినా ప్రజల జీవనోపాధిని, అభివృద్ధిని దెబ్బతీస్తుందని ఆయన వివరించారు.పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడుల (26/11 ముంబై, పుల్వామా, పహల్గామ్) గురించి ప్రశ్నించగా.. చర్చలు, సంప్రదింపులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని షా బదులిచ్చారు. ఉగ్రవాదం, భద్రతాపరమైన ఆందోళనలతో సహా అన్ని క్లిష్టమైన సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. చర్చలు నిరంతరాయంగా కొనసాగాలని, ఏ దశలోనూ ఇరు దేశాల మధ్య సంభాషణలు ఆగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉగ్రవాదంపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న