
అభివృద్ధి చేసిన బిట్స్ హైదరాబాద్ ఆచార్యులు ఈనాడు, హైదరాబాద్: మూత్రపిండాల పనితీరులో లోపాలను గుర్తించే మొబైల్ పరికరాన్ని బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతినాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్.
పొన్నాలగు, సంకేత్ గోయల్‌లు అభివృద్ధి చేశారు. మూత్రపిండాల పనితీరులో లోపాలను గుర్తించేందుకు అవసరమైన బయోమార్కర్ పరీక్షలు ఆసుపత్రుల్లోని ప్రయోగశాలల్లోనే చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా వీరు పోర్టబుల్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రో కెమికల్ డయాగ్నోస్టిక్ పేరుతో రోగుల వద్దకు తీసుకెళ్లే పరికరాన్ని రూపొందించారు. లేజర్ గ్రాఫేన్, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోకెమికల్ సెన్సర్లు ఈ పరికరంలో ఉంటాయి. దీన్ని ఉపయోగించి కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, యూరియా బయోమార్కర్ల పరిమితులను తెలుసుకోవచ్చు. సెల్ఫోన్లో ప్రత్యేకంగా ఉన్న బ్రౌజర్ ద్వారా మూత్రపిండాల్లోని బయోమార్కర్‌ను పోర్టబుల్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రోకెమికల్ పరికరం గుర్తిస్తుంది. ప్రయోగశాలలో ఈ పరికరం పనితీరును పరిశీలించిన ఆచార్యులు తమ పరిశోధన పత్రాన్ని సైన్స్ డైరెక్ట్ జర్నల్‌కు పంపగా... కొద్దిరోజుల క్రితం ఆన్లైన్లో ప్రచురితమైంది. ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు పరీక్షలు నిర్వహించనున్నామని బిట్స్ హైదరాబాద్ ఆచార్యులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.