కొబ్బరి నూనె కుదుళ్లకు లోతు నుంచి పోషణ అందించి జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక తలకు రాసుకోండి.
గంటపాటు ఉంచి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టును మృదువుగా, బలంగా మార్చడానికి అలోవెరా సహాయపడుతుంది. తాజా అలోవెరాను కుదుళ్లకు బాగా పట్టించి గంటసేపు ఉంచి తలస్నానం చేస్తే మంచిది.
అరటి పండులోని సిలికా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు చిట్లడం నివారిస్తుంది. దీనికోసం పండిన అరటి గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి తలకు రాసుకోండి. అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిది.
కోడిగుడ్లలోని బయోటిన్, అమైనో యాసిడ్స్ జుట్టును తిరిగి బలంగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. దీనికోసం కోడిగుడ్లలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి తలకు రాసుకోండి. అరగంట పాటు ఉంచి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు బలంగా ఉంటుంది.
తేనె, బాదం నూనె జుట్టును తేమగా, బలంగా ఉంచుతాయి. జుట్టు చిట్లిపోకుండా కాపాడుతాయి. దీనికోసం తేనెలో కొద్దిగా బాదం నూనె కలిపి జుట్టుకు రాసుకోండి. అరగంట ఉంచి కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే మంచిది.
అవకాడోలోని ఫ్యాటీ యాసిడ్స్ కుదుళ్లకు బలం చేకూరుస్తాయి. జుట్టు సమస్యలు రాకుండా కాపాడుతాయి. దీనికోసం అవకాడోను గుజ్జు చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు.
బొప్పాయిలో విటమిన్ ఎ, ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణ అందించి జుట్టును చిట్లిపోకుండా కాపాడుతాయి. దీనికోసం బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి తలకు రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే మంచిది.
మెంతుల్లోని పోషకాలు కుదుళ్ల బలం పెంచి జుట్టు చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. వెంట్రుకలను మృదువుగా మారుస్తాయి. దీనికోసం మెంతులను రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాసుకోండి. అరగంట పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తాయి. దీనికోసం మందారం ఆకులను పేస్ట్ చేసి తలకు రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే మంచిది.