
IndiGo lite | దిల్లీ: ఇండిగో పేరిట విమానాలను నడిపే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. తక్కువ లగేజీతో (కేవలం క్యాబిన్ బ్యాగ్ మాత్రమే) ప్రయాణించేవారికి తక్కువ ఛార్జీతో విమానంలో...
IndiGo lite | దిల్లీ: ఇండిగో పేరిట విమానాలను నడిపే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. తక్కువ లగేజీతో (కేవలం క్యాబిన్ బ్యాగ్ మాత్రమే) ప్రయాణించేవారికి తక్కువ ఛార్జీతో విమానంలో ప్రయాణించేలా ‘ఇండిగో లైట్’ పేరుతో ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది. డైరెక్ట్ ఫ్లైట్లలో మాత్రమే అనుమతిస్తారు. ఇందులో సాధారణ ఎకానమీ టికెట్లతో పోలిస్తే టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి.
ఇండిగో లైట్ కింద కేవలం 7 కేజీల వరకు క్యాబిన్ బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. అదనపు రుసుము లేకుండా ఆటోమెటిక్ సీటును కేటాయిస్తారు. తక్కువ లగేజీతో ప్రయాణించేవారు వారు పొందుతున్న సేవలకు మాత్రమే చెల్లించేలా ఈ టికెట్ విధానాన్ని డిజైన్ చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. విమాన ప్రయాణాన్ని మరింత ఎక్కువ మందికి, తక్కువ ధరలో అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అలోక్ సింగ్ తెలిపారు. ఇండిగో యాప్, వెబ్సైట్లో బుకింగ్‌పై మాత్రమే వర్తిస్తుంది. ఎయిరిండియా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సైతం ‘ఎయిరిండియా లైట్’ పేరిట క్యాబిన్ బ్యాగేజీ ఓన్లీ ఫేర్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇండిగో రోజూ 2100 విమాన సర్వీసులను నడుపుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.